దివ్య ఉన్ని విడాకులకు కారణం భర్త అక్రమ సంబంధం | reason behind Divya Unni's Divorce

Reason behind divya unni s divorce

Malayalam Actress files for Divorce, Divya Unni divorce, Divya Unni husband Sudhir Shekharan, Sudhir Shekharan about Divya Unni, Divya Unni telugu film, Divya Unni news

Malayalam Actress-dancer Divya Unni recently announced her separation with husband Dr. Sudhir Shekharan.

అక్రమ సంబంధంతో నటి విడాకులు?

Posted: 08/17/2016 03:32 PM IST
Reason behind divya unni s divorce

సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాలు ముఖ్యంగా సినిమా ఫీల్డ్ కు చెందిన వారి విషయాలు మీడియాకి ఎక్కితే ఎంతటి మజా ఉంటుందో తాజాగా నటి అమలాపాల్ వ్యవహారంలో చూశాం. భర్తతో వ్యక్తిగత విషయంలో తేడా కొట్టేయటంతో విడాకులకు సిద్ధపడినట్లు పైకి చెబుతున్నప్పటికీ , పెళ్లయ్యాక కూడా ఆమె సినిమాల్లో నటించడం మూలంగానే ఇదంతా జరిగిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా మరో నటి కూడా ఇలా కెరీర్ విషయంలో కాంప్రమైజ్ కాక విడాకులకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

మళయాళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన దివ్య ఉన్ని(34) భర్త నుంచి విడిపోతున్నట్లు మాలీవుడ్ టాక్. 7 వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ ను ప్రారంభించిన ఉన్ని సౌత్ లోని అన్ని భాషల్లో కలిపి 50కి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. తెలుగులో వేణు నటించిన ఇల్లాలు ప్రియురాలు(2006) లో ఆమె హీరోయిన్. అయితే 21 ఏళ్ల వయసులోనే వైద్యుడు అయిన సుధీర్ సుధాకరన్ పెళ్లి చేసుకుంది. ఆపై కొన్ని సినిమాల్లో నటించి అమెరికా వెళ్లిపోయి, అక్కడ కొన్నాళ్లు ఉంది. తిరిగొచ్చాక సీరియల్స్ లో, అడపా దడపా చిత్రాల్లో కూడా మెరిసింది. రీసెంట్ గా సినీ బాలీవుడ్ లో వచ్చిన ట్రాఫిక్ చిత్రంలోనూ ఓ పాత్రలో మెరిసింది.  

స్వతహాగా క్లాసిక్ డాన్సర్ అయిన దివ్య త్వరలో ఓ డాన్స్ స్కూల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కానీ, భర్త సుధీర్ కు మాత్రం అది సుతరామం ఇష్టం లేదంట. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ బాగా ముదిరిందని, పెద్దలు రాజీ కుదురుస్తున్నా ఇగోకి పోయి విడిపోవాలని డిసైడ్ అయ్యారని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో భర్త నుంచి వెళ్లిపోయి దివ్య తన ఇద్దరు పిల్లతో ప్రస్తుతం తల్లిదండ్రులతో ఉంటుందని చెప్పుకుంటున్నారు.

అయితే దివ్య తరపున ఈ వాదన మరోలా ఉంది. భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవటం వల్లే విడాకులకు సిద్ధమైందని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు. కారణం ఏదైనా పెళ్లయ్యి 14 ఏళ్ల తర్వాత వీరి జంట విడిపోతుండటంపై ప్రస్తుతం సౌత్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malayalam Actress  Divya Unni  husband Sudhir Shekharan  divorce  

Other Articles