చిరంజీవి 150 కి నెపోలియన్ టైటిల్ ఫిక్స్? | Napoleon title fixed for Chiranjeevi 150th Movie

Whether napoleon title fixed for chiranjeevi 150th movie

Chiru Napoleon firstlook, Chiru 150 title fix, Napoleon firstlook viral, Chiru as Napoleon, Chiru Napoleon title fake, charan on Napoleon title

Megastar Chiranjeevi 150th movie Napoleon. Chiru Napoleon firstlook viral in social media.

చిరు కోసం సునీల్ టైటిల్

Posted: 07/28/2016 09:59 AM IST
Whether napoleon title fixed for chiranjeevi 150th movie

మెగాస్టార్ గ్రాండ్ రీఎంట్రీ కోసం రంగం సిద్ధం అవుతున్న వేళ హీరోయిన్ ఒక్కటే ఇన్నాళ్లూ సమస్య అనుకుంటున్న యూనిట్ కు టైటిల్ విషయంలో కూడా పెద్ద చిక్కులే ఎదురయ్యాయి. కత్తిలాంటోడు మొదటి నుంచి జనాల్లో గట్టిగా నానుతున్నప్పటికీ అది కాదంటూ రాంచరణ్ ఒక్కసారి తుస్సు మనిపించాడు. ఈ చిత్ర అఫీషియల్ టైటిల్ ను త్వరలోనే విడుదల చేస్తానంటూ ఆ మధ్య ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ సందర్భంగా ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో చిరు స్టామినాకు తగ్గ టైటిల్స్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని హల్ చల్ చేశాయి. అయితే తమ నుంచి కన్ఫర్మ్ వచ్చేదాకా ఏదీ ఫిక్స్ కావొద్దంటూ చరణ్ చెప్పేశాడు. తాజాగా బుధవారం రాత్రి నుంచి ఈ చిత్రానికి టైటిల్ ఇదేనంటూ మరోకటి వచ్చిపడింది. ‘నెపోలియన్’ అని ప్రకటించి ‘పోరాటం అతని నైజం’ అనే ట్యాగ్ లైన్‌ను జత చేశారు. ఈ పోస్టర్‌లో పొలం దున్నుతున్న రైతును పెట్టి చిరంజీవి ముఖంపై భూభత్సం, రైతు ఆత్మహత్యలు, ల్యాండ్ మాఫియా వంటి అంశాలకు సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్‌లను ప్రచురించారు.

మరి ఇదే అఫీషియల్ టైటిలా..? లేదా ఇది కూడా ఉత్తదేనా అన్న విషయం తెలియాలంటే మెగా సైడ్ నుంచి ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అన్నట్లు గతంలో ఇదే టైటిల్ తో ఓ యాక్షన్ సినిమా చేసేందుకు సునీల్ ప్రయత్నం కూడా చేశాడు లేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  Chiranjeevi  150th movie  Napoleon  Ram Charan  

Other Articles