కబాలిపై నానాపటేకర్ షాకింగ్ కామెంట్లు | nanapatekar shocking comments on kabali

Nanapatekar shocking comments on kabali

Nanapatekar rajanikanth, nanapatekar on Kabali, Kabali not a film, kabali rajanikantha shock, bollywood actor comments on kabali, rajani not supersar story is real super star

Nanapatekar shocking comments on Kabali and Rajanikanth.

షాక్ : రజనీ సూపర్ స్టార్ కానే కాదు...

Posted: 07/28/2016 10:25 AM IST
Nanapatekar shocking comments on kabali

ఇండియన్ సినిమాల్లో ప్రత్యేకించి సౌత్ లో హీరోలకు ఉన్నంత క్రేజ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదంటే నమ్మి తీరాల్సిందే. కబాలి విషయంలో ఆ విషయం మరోసారి రుజువైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన  దాని ఫలితం ఏంటో మనకు తెలిసిందే. అయినా రికార్డు స్థాయి కలెక్షన్లతో అది దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ పంక్షన్ కు హాజరయిన నటుడు నానాపటేకర్ ను కబాలి గురించి ప్రశ్నించగా ఆయన షాకింగ్ కామెంట్లు చేశాడు.

నటుల్లో ఎవరూ ప్రత్యేకంగా సూపర్ స్టార్ లుండరని, కథ బాగుంటే చిన్న సినిమా అయినా రికార్డు వసూళ్లు చేస్తుందని అన్నారు. మన దేశంలో సినిమా అనేదే సూపర్ స్టార్ అని, కథ బాగుండకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా కొట్టుకుపోవాల్సిందేనని నానా పటేకర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి ఏ నటుడూ సూపర్ స్టార్ కాదు. ఎందుకంటే.. ఏ సూపర్ స్టార్ లేకపోయినా సరైన కథతో వచ్చిన చిన్న చిన్న సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. ఇదే క్రమంలో పేళవమైన కథతో వచ్చిన సూపర్ స్టార్స్ సినిమాలు కూడా మూడురోజుల్లో థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి"!! ఈ రేంజ్ లో నానాపటేకర్ స్పందించారు.

నానాపటేకర్ దేశం గర్వించదగ్గ నటుడు అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ, ఓవైపు ఫలితంతో సినిమా ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రజనీ అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టేవిగానే ఉన్నాయి. దీనిపై ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth  kabali  nanapatekar  kabali  shocking comments  

Other Articles