తమన్నా అభినేత్రి టైటిల్ మారబోతుందా? | tamanna abhinetri title changed

New title for tamanna abhinetri

new title for tamanna, devi title fix for tamanna, tamanna as devi in telugu too, tamanna as devi, tamanna ghost

tamanna abhinetri title changed to Devi.

ఏంటీ! తమన్నా అభినేత్రి లేదా?

Posted: 07/27/2016 03:09 PM IST
New title for tamanna abhinetri

మిల్కీ తమన్నా లీడ్ రోల్ లో ప్రభుదేవా హీరోగా రూపొందుతున్న చిత్రం అభినేత్రి. 70 కోట్ల బడ్జెట్ తో  తెలుగు, తమిళ భాషల్లో విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంప్రదాయబద్ధమైన చీరకట్టులోను, మోడ్రన్ డ్రెస్సుల్లోను తమ్మూ ద్విపాత్రి భినయం చేయబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది.

తెలుగులో ఈ చిత్ర టైటిల్ మారబోతుందని సమాచారం. ఈ సినిమాకి తెలుగులో 'అభినేత్రి' అని .. తమిళంలో 'దేవి' అని టైటిల్ ను ఖరారు చేశారు. అయితే తెలుగులోను 'దేవి' పేరుతోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.

కారణం తెలీయకపోయినప్పటికీ మరో నిర్మాణ సంస్థ ఇదే టైటిల్ ను రిజిస్టర్ చేయించుకోవటంతో న్యాయ పరంగా చిక్కులు ఎదురు కావొద్దన్న ఉద్దేశంతో టైటిల్ మార్చే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నారంట. దీనిపై స్పష్టమైన ప్రకటన రావలసి వుంది. ఆగస్టు 1న ఒక టీజర్ రిలీజ్ చేసి, 15న ఆడియో వేడుక,  సెప్టెంబర్ 9న సినిమాను రిలీజ్ చేయాలన్న ఫ్లాన్ లో ఉన్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna  abhinetri  devi  prabhudeva  dual role  director vijay  

Other Articles