డైలాగ్ కింగ్ సాయికుమార్ బర్త్ డే స్పెషల్ | dialogue king king saikumar birthday special

Dialogue king saikumar birthday special

saikumar birthday special, saikumar birthday, dialogue king saikumar, dialogue king birthday special

dialogue king saikumar birthday special.

డైలాగ్ కింగ్ సాయికుమార్ బర్త్ డే స్పెషల్

Posted: 07/27/2016 12:47 PM IST
Dialogue king saikumar birthday special

తెలుగు సినీ చరిత్రలో కంచు కఠం అంటే టక్కున గుర్తుచ్చేపేరు కళావాచస్పతి కొంగర జగ్గయ్య. అయితే ఆయన ఇండస్ట్రీలో క్రమంగా సినిమాలకు దూరమవుతున్న సమయంలో ఆ లోటును భర్తీ చేయడానికే అన్నట్లు వచ్చాడు సాయి కుమార్. మూడు దశాబ్దాలకు పైగా తన గంభీరమైన గొంతుతో ఆ సమయంలో అగ్ర హీరోలకు గొంతుకను అందించడంతోపాటు నటుడిగా కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు సాయికుమార్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి...

- సాయి కుమార్ పూర్తి పేరు సాయి కుమార్ శర్మ పుడిపెద్ది.ప్రముఖ నటుడు స్వర్గీయ పీజే శర్మ, కృష్ణజ్యోతి దంపతులకు సంతానంగా 1960 జూలై 27న మద్రాస్  లో జన్మించారు.

- తండ్రి నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కావటంతో చిన్నప్పటి నుంచే ఆయనపై ప్రభావం చూపసాగాయి. అందుకే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే పిల్లల పాత్రలకు డబ్బింగ్ చెప్పటం ప్రారంభించాడు.

- బాపు దర్శకత్వంలో వచ్చిన  స్నేహం (1977) చిత్రం ద్వారా నటుడిగా ఆరంగ్రేటం చేశాడు. ఆపై 1981 లో సుమన్ హీరోగా వచ్చిన తరంగిణి చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆ చిత్రానికి గానూ ఆయన అందుకున్న రెమ్యునేషన్ 250 రూపాయలు.

- ఆపై తర్వాత ‘పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు’ సినిమాకు 1,116 రూపాయలు అందుకుని సౌత్ లోనే అతి ఎక్కువ పారితోషకం అందుకున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రికార్డు సృష్టించాడు.

- కానీ, నటుడిగానే రాణిద్దామన్న ఉద్దేశంతో తల్లి వద్దని వారిస్తున్న అప్పటి నుంచి కొన్నాళ్లపాటు డబ్బింగ్ కు పుల్ స్టాప్ పెట్టాడు. తద్వారా గొప్ప గొప్ప చిత్రాలకు గాత్రం అందించే అవకాశాన్ని కోల్పోయాడు. అది ఎంత తప్పో ఆ తర్వాత ఆయనకు తెలిసి వచ్చింది.

- 90వ దశకం వచ్చే సరికి తిరిగి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయన ఫుల్ బిజీ అయ్యారు. సుమన్, రాజశేఖర్ లాంటి నటులు టాప్ హీరోగా ఎదిగారంటే దానికి కారణం సాయి కుమార్ అందించిన గాత్ర దానమే.

- ఓవైపు డబ్బింగ్ చెబుతూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఆయన సొంతంగా నిర్మాతగా మారి కొన్ని సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు.

- పోలీస్ స్టోరీ: ఆర్థికంగా బాగా చితికిపోయి కష్టాల్లో ఉన్న సమయంలో అసలు సిసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నారాయన. 1996లో వచ్చిన పోలీస్ స్టోరీ కన్నడతోపాటు తెలుగులో కూడా కలెక్షన్ల్ వర్షం కురిపించింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అగ్నిగా ఆయన నోటి నుంచి వచ్చిన డైలాగులు   ఇప్పటికీ రీసౌండ్ తో మన చెవుళ్లో మారుమ్రోగుతుంటాయి. ఆపై వరుసగా కన్నడలో 8 వరుస హిట్లు ఆయన అందుకున్నారు.

- కాస్త గ్యాప్ ఇచ్చి తెలుగులోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన రాణిస్తున్నాడు. సామాన్యుడు, ప్రస్థానం లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన నటన అమోఘం. ఆయా చిత్రాలకు ఆయన పలు అవార్డులు కూడా అందుకున్నారు.

- ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇలా నందమూరి తరంలోని హీరోలతో ఆయన ప్రయాణం సాగింది.

- ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. తమ్ముళ్లు రవిశంకర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా, విలన్ గా కూడా కన్నడ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు. మరో సోదరుడు అయ్యప్ప పి శర్మ కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇక ఇప్పుడు తనయుడు ఆది   హీరోగా తన స్టామినాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.


పవర్‌ఫుల్‌ డైలాగ్‌లకు కేరాఫ్‌ సాయికుమార్‌. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా ఆ గొంతుకలో పలకని భావం లేదు. పేజీల పేజీల డైలాగులను ఒక్కసారి చూసి అవలీలగా చెప్పే దమ్ము ఒకప్పుడు ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఇప్పుడు సాయి కుమార్ మాత్రమే.  నవ్యాంధ్రకు పోలీస్ విభాగం బ్రాండ్ అంబాసిడర్‌గానే కాదు... అమరావతి శంకుస్థాపన సమయంలో వ్యాఖ్యతగా, పుష్కరాల కు గొంతుకను అందించే బాధ్యతలు ఆయన్ని వరించాయి. అలాంటి గంభీరమైన స్వరం మనకు మరింత కాలం వినిపించాలని, మరిన్ని సినిమాల్లో ఆయన నటిస్తూ అలరించాలని మనసారా కోరుకుంటూ తెలుగు విశేష్ తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు...

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dialogue king  saikumar  birthday special  

Other Articles