sahasame swasaga sagipo audio release

Sahasame swasaga sagipo audio release

sahasame audio, sss audio, sahasame swasaga sagipo audio, nag chaitanya audio, nag chaitu audio, chaitu movies, chaitu movie, nagachaitu and gowtham menon

sahasame swasaga sagipo movie audio release on friday. this movie nagachaitanya leading main role, and directed by gowtham menon. and music given by ar rehman.

ఆ సాహసంతోనే వస్తున్నాడు...!

Posted: 06/18/2016 10:42 AM IST
Sahasame swasaga sagipo audio release

నాగచైతన్య మళ్లీ ప్రేమకథల్లోకి పడ్డాడు. వరుసగా చైతూ రెండు విభిన్నమైన ప్రేమకథలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఒరటి ప్రేమమ్ మలయాళం రీమేక్ లోనటిస్తుంటే, మరొకటి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న 'సాహసమే శ్వాసగా సాగిపో'. ఈ సినిమాని ఇప్పుడందరూ త్రిబుల్ యస్ సినిమా పిలుస్తున్నారు. ఈ సినిమా ఆడియో పాటలు గ్రాండ్ గా మార్కెట్ లోకి విడుదలయ్యాయి. ఈ ఆడియోఫంక్షన్ లో నాగచైతన్య మాట్లాడుతూ... ‘నా సినీ ప్రయాణానికి ‘ఏమాయ చేసావె’తో మంచి దారి దొరికింది. నన్ను ప్రేమకథల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారనే విషయం తెలిసింది. ఈ సినిమాతో మరో కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నా’’ అన్నారు.  

ఆడియో ఫంక్షన్ లో తొలి సీడీని ప్రముఖ కథానాయకులు నాగార్జున, గోపీచంద్‌ ఆవిష్కరించారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వీకరించారు. వి.వి.వినాయక్‌ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘ఒక నెల కిందే నాకు పాటల సీడీ తెచ్చిచ్చాడు చైతన్య పాటలు వింటున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి. సన్నివేశాలు చూస్తుంటే గౌతమ్‌మేనన్‌ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు అనిపిస్తోందని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వివి వినాయక్, దర్శకుడు గౌతమ్ మీనన్, ఎ.ఆర్ రెహ్మాన్, కోన వెంకట్‌, డి.సురేష్‌బాబు, సాయిధరమ్‌ తేజ్‌, రెజీనా, వంశీ పైడిపల్లి, కల్యాణ్‌కృష్ణ, అనంత శ్రీరామ్‌, దశరథ్‌, మాజీ డీజీపీ దినేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni naga chaitanya  nag chaitu  chaitanya  a r rehman  gowtham menon  

Other Articles