balayya 100th movie shooting news

Balayya 100th movie shooting news

balayya 100th movie, balayya next movie, balayya vs krishh, director krishh, krishh making, gowthami putra making, gowthami putra war scenes

balayya 100th movie shooting in war scenes in hyderabad. in a speacila attractive sets desingned by these war secens in this movie. the movie directed by krishh.

యుద్ధానికి శంఖం మోగింది...!

Posted: 06/18/2016 10:27 AM IST
Balayya 100th movie shooting news

యుద్ధానికి శంఖం మోగించాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. శత్రువులను చీల్చి ఛండాడేందుకై కదనరంగంలోకి అడుగుపెట్టనున్నాడు. కత్తి చేతపట్టి , గుర్రాన్ని లంఘించి శత్రువులను హతమార్చేందుకు ఆయుధాలను సిద్దం చేస్తున్నాడు. తన 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి కోసం ఇదంతా చేస్తున్నాడు.
జూన్ 20వ తేది నుంచి హైదరాబాద్‌లో యుద్ధం నేపథ్యంలో సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ క్రిష్. అందుకోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకమైన సెట్‌ను తీర్చిదిద్దారు.

సుదీర్ఘంగా సాగే ఆ యుద్ధ సన్నివేశంలో బాలకృష్ణతోపాటు వందల మంది జూనియర్‌ ఆర్టిస్టులు నటించబోతున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రియ ఒక ప్రధానమైన రాణి గెటల్ లో నటిస్తోంది. మొరాకోలో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణని పూర్తి చేసుకొచ్చిన ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు యుద్ధ సన్నివేశాలకు శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్‌లో మొదలయ్యే ఈ కొత్త షెడ్యూల్‌ నుంచే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ రంగంలోకి దిగబోతున్నాడు. మోక్షజ్ఞ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ కోసం సహాయ దర్శకుడిగా పనిచేయబోతున్నాడు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యేవరకు తండ్రితోపాటే ప్రయాణం చేయబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో యువరాజు గెటప్ లో తెరంగేట్రం కూడ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 - మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles