ameerkhan and salmankhan acting again in new film

Ameerkhan and salmankhan acting again in new film

aameerkhan and salman, andhaj apna apna sequal, aameer sequal, salman sequal , ameer upcoming movie, aameer khan next, salman khan upcoming, salman khan next, salman khan vs aameer khan

bollywood star heros ameerkhan and salmankhan acting again in new film. this film is directed by vikas bhatt or vikramaditya motwani.

ఇద్దరి జోడి మళ్లీ కుదిరింది...!

Posted: 06/18/2016 11:40 AM IST
Ameerkhan and salmankhan acting again in new film

అప్పట్లో బాలీవుడ్ దిగ్గజాలు ఆమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందాజ్‌ అప్నా అప్నా’ సినిమా అందరికీ గుర్తుండిపోయింది. అమర్‌, ప్రేమ్‌ పాత్రల్లో అమీర్‌, సల్మాన్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిన్న పిల్లల మాదిరి అమర్‌, ప్రేమ్‌ చేసే సరదా చేష్టలు ప్రేక్షకుల్ని కట్టిపారేసాయి.

రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వినోదాత్మక ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా సీక్వెల్‌ గురించి ఆమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ ''అందాజ్ అప్నా అప్నా'' సీక్వెల్‌లో సల్మాన్‌ఖాన్‌తో నటించడం నాకు ఇష్టమే. కథ బాగా కుదరితే ఖచ్చితంగా ఈ సినిమా త్వరలోనే ఉంటుందని చెప్పాడు. ఈ సీక్వెల్‌కు వికాస్‌ భట్‌, విక్రమాదిత్య మొత్వానీ ఈ ఇద్దరిలో ఒకరు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఫాంథమ్‌ ఫిలిమ్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో ఉందని బాలీవుడ్‌ సమాచారం.

ప్రస్తుంత ఆమీర్ ఖాన్ నటిస్తున్న దంగల్ సినిమా, సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ వినపడటంతో బాలీవుడ్ లో ఇప్పుడు వీళ్లిద్దరి జోడి మళ్లీ వెండితెరపై కనువిందు చేయనుందని అభిమానులు పండగ చేసకుంటున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aameerkhan  salmankhan  bollywood aameer  bollywood salman  salman movies  aameer movies  

Other Articles