సుధీర్‌బాబు, నందిని జంటగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. లక్ష్మీనరసింహా ఎంటర్టైన్మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మొదటగా ఈ నెల 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఒక రోజు ఆలస్యంగా ఈ నెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తన తెలివితేటలతో ఎదుటి వారిని మోసం చేస్తూ సరదాగా జీవితాన్ని గడిపే యువకుడు క్రిష్. ఎలాంటి గోల్ లేని అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ పెద్ద లక్ష్యం వచ్చి చేరుతుంది. అదేమిటి? 12 శతాబ్దానికి చెందిన సీతారాముల విగ్రహాలతో అతనికి ఉన్న సంబంధమేమిటి? అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదిని అలరిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ ‘కథ,కథనాలు వినూత్న తరహాలో సాగుతాయి. మణికాంత్ ఖాద్రి అందించిన స్వరాలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రేమ, వినోదం, యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో మేళవించి దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని అన్నారు.
అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, పాటలు: శ్రీమణి, కె.కె, సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more