Puri Jagannadh | Auto Johnny | Movie Story

Puri jagannadh clarifies on auto johnny movie story

Puri Jagannadh Clarifies on Auto Johnny, Puri Jagannadh Clarifies, Puri Jagannadh Clarifies about Auto Johnny, Puri Jagannadh Clarifies rumors, Puri Jagannadh on Auto Johnny, Auto Johnny movie news, Auto Johnny latest news, Puri Jagannadh movie news, Puri Jagannadh movie updates, Puri Jagannadh latest tweets, Puri Jagannadh

Puri Jagannadh Clarifies on Auto Johnny Movie Story: Director Puri jagannadh Upcoming movie with megastar chiranjeevi. movie title Auto Johnny. Ram charan producer.

ఆటోజానీ పుకార్లను నమ్మకండి: పూరీ జగన్నాథ్

Posted: 05/14/2015 09:38 AM IST
Puri jagannadh clarifies on auto johnny movie story

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బివిఎస్ఎన్ రవి, గోపి మోహన్ లు స్ర్కిప్టును సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి పూరీ ‘ఆటోజానీ’ అనే టైటిల్ ఖరారు చేసారు. అయితే ఈ చిత్ర కథ అమెరికాకు చెందిన వాసు దేవ్ వర్మ అనే రచయితకు సంబంధించినదని గతకొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి.

ఈ వార్తలపై ఇప్పటికే రచయితలు రవి, గోపిలు ఓ క్లారిటీ ఇచ్చేసారు. ‘ఆటోజానీ’ ఎక్కడ నుంచి కాపీ కొట్టలేదని, ఇది తమ సొంత కథని ప్రకటించారు. అంతే కాకుండా ఇంకా ఏమైనా సందేహాలు, సమస్యలుంటే రచయితల సంఘంలో మాట్లాడి పరిష్కరించుకోవచ్చునని ధైర్యంగా ప్రకటించేసారు.

ఇదే విషయంపై తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా స్పందించారు. పూరీ తెలియజేస్తూ.. ‘ఆటోజానీ’ మూలకథ తానే సొంతంగా రాసినదని, దీనిపై వస్తున్న పుకార్లను నమ్మకండి అంటూ పూరీ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ నిర్మించనున్నాడు. ఈ ప్రాజెక్టును చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles