Nayanatara maya tamil movie mayuri telugu dubbing

nayanatara, nayanatara maya movie, nayanatara mayuri movie, nayanatara hot photos, nayanatara hot gossips, nayanatara latest news, nayanatara mayuri movie, ashwin saravanan

nayanatara maya tamil movie mayuri telugu dubbing : Nayanatara mayuri movie is ready to release in tollywood which is dubbing of tamil maya movie.

‘నైట్ షో’ చూయిస్తుందనుకుంటే.. ‘మాయ’ చేసేసింది!

Posted: 02/26/2015 12:45 PM IST
Nayanatara maya tamil movie mayuri telugu dubbing

మూడుపదుల ముద్దుగుమ్మ నయనతార తన సెకండ్ ఇన్నింగ్స్ ని మరింత వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. చిన్నాపెద్దా హీరోలంటూ తేడాలేకుండా అందరితోనూ నటిస్తోంది. అలాగే.. లేడీ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు తమిళంలో ఓ హీరోయిన్ ప్రధాన చిత్రం వరించింది.

దర్శకుడిగా పరిచయమవుతున్న అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నయనతార నటిస్తోంది. ఈ చిత్రానికి ముందుగా ‘నైట్ షో’ అనే టైటిల్ దర్శకనిర్మాతలు పెట్టారు. అయితే.. ఆ టైటిల్ నయనకు నచ్చకపోవడంతో దాన్ని ‘మాయ’గా మార్చాల్సిందిగా సూచించిందట! దాంతో ఆ మూవీ టైటిల్ ని ‘మాయ’గా మార్చడం జరిగింది. ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే.. నయనతార తల్లి పాత్రలో నటిస్తోంది.

ఇదిలావుండగా.. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘మయూరి’ పేరిట తెలుగులో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayanatara  mayuri movie updates  tamil movies  

Other Articles