Mahesh babu koratala siva sreemanthudu overseas rights classics entertainment

mahesh babu latest news, mahesh babu sreemanthudu movie, mahesh babu koratala siva movie, mahesh babu news, sreemanthudu overseas rights, sreemanthudu overseas collections, sreemanthudu movie updates, classics entertainment, Classics Entertainment distributors, overseas distributors, south Indian movie distributors, shruti hassan, jagapathi babu

mahesh babu koratala siva sreemanthudu overseas rights Classics Entertainment : Classics Entertainment one of the leading south Indian movie distributors in Overseas, who are long been associated with overseas movie business has acquired overseas distribution rights of Super Star MAHESH Babu’s prestigious family entertainer SREEMANTHUDU (Tentative Title) directed by Koratala Siva (Mirchi Fame).

భారీ రేటుకు అమ్ముడుపోయిన ‘శ్రీమంతుడు’ ఓవర్సీస్ రైట్స్!

Posted: 02/26/2015 01:53 PM IST
Mahesh babu koratala siva sreemanthudu overseas rights classics entertainment

ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఈ చిత్రానికి అధికారికంగా ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ.. ‘శ్రీమంతుడు’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో వుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన తొలిసారిగా శృతిహాసన్ జతకడుతోంది. ఇక ఇందులో జగపతిబాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, కమెడియన్ ఆలీ, వెన్నెల కిషోర్, తులసి, సితార తదితరులు నటిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ‘క్లాసిక్స్ ఎంటర్ టైన్ మెంట్’ సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసిందని సమాచారం! ఓవర్సీస్ లో వున్న సౌత్ ఇండియన్ మూవీ డిస్ట్రిబ్యూటర్లలో ఒకటైన ఈ సంస్థ.. ఎన్నాళ్ల నుంచో సినిమా రైట్స్ ని కొనుగోలు చేస్తూ బిజినెస్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంకా షూటింగ్ దశలోనే వున్న మహేష్ మూవీని ఈ సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ తమకు లభించినందుకుగానూ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ఆ సంస్థ వ్యక్తం చేస్తోంది.

ఇక ‘ఆగడు’ చిత్రంతో డిజాస్టర్ చవిచూసిన మహేష్.. ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరోవైపు అభిమానులు కూడా ఈ చిత్రం విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  koratala siva  sreemanthudu overseas rights  classics entertainment  

Other Articles