Amitabh bachchan twitter bharat ratna award mamata benerjee demand padma list

amitabh bachchan news, amitabh bachchan twitter, amitabh bachchan padma vibhushan, amitabh bachchan bharat ratna, mamata benerjee latest news, mamata benerjee amitabh bachcha, padma vibhushan awards, bharat ratna awards

amitabh bachchan twitter bharat ratna award mamata benerjee demand padma list : the bollywood big b has tweeted that he doesn't deserve to take bharat ratna award yet.

దీదీ అభిప్రాయంతో విభేదించిన బిగ్’బీ!

Posted: 01/27/2015 05:34 PM IST
Amitabh bachchan twitter bharat ratna award mamata benerjee demand padma list

ఇటీవలే కేంద్రప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే! ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్’కు పద్మవిభూషణ్ అవార్డు లభించినట్లుగా కేంద్రం పేర్కొంది. దీంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. బిగ్ బీ లాంటి లెజెండరీ యాక్టర్’కు పద్మవిభూషణ్ అవార్డు తగదని.. దానికి బదులుగా ఆయనకు ‘భారతరత్న’ పురస్కారాన్ని అందజేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) పరోక్షంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

అయితే.. తాజాగా ఆమె అభిప్రాయాన్ని విభేదిస్తూ తాజాగా బిగ్ బీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీదీ వ్యాఖ్యలపై ట్విటర్’లో స్పందించిన అమితాబ్.. తాను అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘భారతరత్న’కు తగనంటూ తిరస్కరించారు. దేశం తనకు ఇచ్చిన గౌవరం ఎంతో సంతోషంగా వున్నానని తెలిపిన ఆయన.. ‘భారతరత్న’ వంటి పురస్కారాలకు తాను అర్హుడిని కానని తెలిపారు. మరి.. ఈ వ్యవహారంపై దీదీ ఎలా స్పందించనున్నారో వేచి చూడాల్సిందే!

మరోవైపు.. మమతా చేసిన పరోక్ష డిమాండ్’పై కేంద్రం ఇంకా స్పందించలేదు. కేంద్రం కంటే ముందే అమితాబ్ స్పందించి, దీదీ అభిప్రాయాన్ని సున్నితంగా తిరస్కరించడాన్ని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా.. ఆయన ఎంత పెద్ద స్థాయిలో వున్నా కూడా ఇంకా ‘భారతరత్న’ పురస్కారానికి అర్హుడిని కానని చెప్పుకోవడం.. ఆయనలోని ఒదిగేవుండే గుణం ఏమేరకు వున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. ఆయన్ను బిగ్ బీగా అభివర్ణిస్తారు అంటూ ఆయన అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachchan twitter  mamata benerjee news  bharat ratna controversy  

Other Articles