Movie moghal ramanayudu health problems doctor cum actor rajashekhar treatment

rajasekhar news, hero rajasekhar news, angry young man rajasekhar, gaddam gang movie, rajasekhar ramanayudu news, producer ramanayudu movies, producer ramanayudu health problems, rajasekhar ramanayudu, gaddam gang movie release

movie moghal ramanayudu health problems doctor cum actor rajashekhar treatment : tollywood angry young man doctor cum actor rajasekhar giving treatment to ramanayudu from few days.

అగ్రనిర్మాత ఆరోగ్యానికి డాక్టర్ కమ్ యాక్టర్ భరోసా!

Posted: 01/27/2015 07:35 PM IST
Movie moghal ramanayudu health problems doctor cum actor rajashekhar treatment

చిత్రపరిశ్రమలో వందకుపైగా సినిమాలను నిర్మించి సరికొత్త రికార్డు నెలకొల్పి మూవీ మొఘల్’గా పేరొందిన అగ్రనిర్మాత డాక్టర్ డి. రామానాయుడు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఈయన ఆరోగ్యానికి భరోసా ఇస్తూ డాక్టర్ కం యాక్టర్ అయిన తెలుగు నటుడు చికిత్స అందిస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం! ఆ నటుడు అందించిన చికిత్స మేరకే ఇప్పుడు రామానాయుడు ఆరోగ్యం కాస్త మెరుగైందని, మునుపటి కంటే బాగానే వున్నారని తెలుస్తోంది. ఇంతకు ఆ నటుడు ఎవరని అనుకుంటున్నారా..? మరెవ్వరో కాదు.. టాలీవుడ్ యాంగ్రీ యంగ్’మేన్’గా పేరొందిన డా.రాజశేఖర్!

యాంగ్రీ యంగ్’మెన్’గా ఎన్నో పవర్’ఫుల్ సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో డా.రాజశేఖర్... కేవలం నటుడు మాత్రమే కాకుండా స్వతహాగా మెడిసిన్ కంప్లీట్ చేసిన ఒక డాక్టర్ కూడా! అందుకే.. తెరమీద ఆయన పేరుముందు ఎప్పటికీ డాక్టర్ అని రాసి వుంటుంది. అంతేకాదు.. చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇంకా వున్నాయి. హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డాక్టర్’గా ప్రపంచప్రఖ్యాతిగాంచిన హోమియోపతి, ఆయుర్వేదిక్, అల్లోపతి, చైనీస్ మెడిస్సిన్స్ పైన రీసెర్చ్ చేశారు. ఇలా రీసెర్చ్ చేసిన ఈయన అన్నిటికంటే హోమియోపతినే బెస్ట్ అని ఎప్పటికీ అంటుంటారు.

rajasekhar-ramanaidu-photos

ఇంకొక తెరముందు తెలియని విషయం ఏమిటంటే.. ఈయన కెరీర్’లో హీరోగా బిజీగా వుంటూనే ఇండస్ట్రీలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చాలామందికి చికిత్స కూడా అందించారు. గతంలో నటుడు సాయికుమార్ తండ్రి పీజే శర్మకి, కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు కేన్సర్ ట్రీట్’మెంట్ ఈయనే ఇచ్చారు. ఇటీవలే మృతిచెందిన ఆహుతి ప్రసాద్’కి చివరి నెలరోజులు రాజశేఖర్ చికిత్స చేశారు. ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న రామానాయుడికి ఈయన చికిత్స అందిస్తున్నారు. రాజశేఖర్ ట్రీట్’మెంట్ మొదలుపెట్టినప్పటి నుంచి రామానాయుడు ఆరోగ్యం చాలావరకు మెరుగైందని కుటుంబసభ్యులతోపాటు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఒక నటుడిగానే కాకుండా ప్రతిఒక్కరికి ట్రీట్’మెంట్ అందిస్తూ తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్న రాజశేఖర్’ను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈయన అందిస్తున్న సేవలకు ప్రతిఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజానికి ఇప్పటివరకు రాజశేఖర్’కి వ్యతిరేకంగా ఎన్నో వార్తలు, పుకార్లు వచ్చినా.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. దీంతో.. ఇండస్ట్రీలో వున్నవారందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు.. రాజశేఖర్ నటించిన తాజా చిత్రం ‘‘గడ్డం గ్యాంగ్’’.. ఫిబ్రవరి 5వ తేదీన రిలీజ్’కి సిద్ధంగా వుంది. ఆ చిత్రం విజయం సాధిస్తుందని ఆయన ఎంతగానో ఆశిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles