Goa beauty ileana sahasam tamil movie julai remake hero prashant

ileana dcruz, goa beauty ileana dcruz news, ileana dcruz hot photos, ileana dcruz bikini photo shoot, ileana sahasam movie, ileana tamil movie, ileana bollywood movies, ileana hot gossips, ileana photo shoot, ileana julai movie

goa beauty ileana sahasam tamil movie julai remake hero prashant : Goa beauty ileana has signed tamil flick sahasam opposite to prashanth. This is a remake of telugu julai movie in which also ileana has played as heroine.

జులాయితో ‘సాహసం’ చేస్తున్న గోవాబ్యూటీ!

Posted: 01/27/2015 05:24 PM IST
Goa beauty ileana sahasam tamil movie julai remake hero prashant

దక్షిణాది పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్’గా వెలుగు వెలిగిన గోవాబ్యూటీ ఇలియానా.. ఆమధ్య తట్టాబుట్టా సర్దుకుని బాలీవుడ్’కి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే! ఆ తర్వాత మళ్లీ ఆమె సౌత్ ఇండస్ట్రీవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో మంచిదని పేర్కొన్న ఈ అమ్మడు, సౌత్ ఇండస్ట్రీపై విమర్శలు కూడా చేసింది. దీంతో కొంతమంది తెలుగు ఆర్టిస్టులు ఆమెపై పెదవి విరిచారు కూడా! అలా ఆ విధంగా వెళ్లిపోయిన అమ్మడు.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని సమాచారం! అక్కడ అవకాశాలు చతికిలపడిపోవడంతో ఈ అమ్మడు సౌత్ జపం చేసుకుంటోందని అంటున్నారు.

తాజాగా ఈ అమ్మడు ఓ తమిళ చిత్రానికి సంతకం చేసినట్లు కోలీవుడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ నటుడు ప్రశాంత్ హీరోగా అతని తండ్రి త్యాగరాజన్ నిర్మిస్తున్న ‘సాహసం’ చిత్రంలోనే ఈమె కథానాయికగా నటిస్తోందని సమాచారం! ఇదిలావుండగా.. ఈ ‘సాహసం’ చిత్రం రెండేళ్లక్రితం తెలుగులో వచ్చిన ‘జులాయి’ చిత్రం ఆధారంగా రూపొందుతోంది. ఈ తెలుగు చిత్రంలోనూ కథానాయికగా ఇలియానా నటించిన సంగతి విదితమే! ఆమె అయితేనే ఆ పాత్రకు సరిపోతుందని భావనతో ఈ తమిళ రీమేక్ చిత్రంలోనూ ఇలియానానే సంప్రదించినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇలా ఈ విధంగా ఈ భామ మళ్లీ సౌత్’లోకి ఎంట్రీ ఇస్తోందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ileana dcruz sahasam movie  julai telugu movie remake  tollywood gossips  

Other Articles