Srinu vaitla to direct vakkantham vamshi story with ram charan

srinu vaitla upcoming movies, srinu vaitla movie with ram charan, ram charan next movie, ram charan with srinu vaitla, tollywood latest updates, vakkantham vamshi movies, latest telugu updates

srinu vaitla to direct vakkantham vamshi story with ram charan : director srinu vatila trying hardly to do movie with ram charan tej for that he pickup vakkantham vamshi and hopes this story will help him to overcome aagadu result

చెర్రి కోసం టెంపర్ లేపిన శ్రీను

Posted: 10/21/2014 01:57 PM IST
Srinu vaitla to direct vakkantham vamshi story with ram charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తో సినిమా చేసేందుకు డైరెక్టర్ శ్రీనువైట్ల నానా తంటాలు పడుతున్నారు. ‘ఆగడు’ ఫ్లాప్ తర్వాత చరణ్ తో చేయాల్సిన సినిమా ఇంచు కూడా ముందుకు కదలటం లేదు. శ్రీను కథలన్నిటిని చెర్రి పక్కనపెడుతున్నాడు. ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా మగధీరతో మాత్రం ప్రాజెక్టు వదిలిపెట్టడం లేదు. ఇందుకోసం తన వద్ద ఉన్న అస్ర్ర్తశస్ర్తాలను ప్రయోగిస్తున్నాడు. తాజాగా చెర్రిని ఒప్పించేందుకు వంశీ బాణంను వదిలినట్లు తెలుస్తోంది.

చరణ్ కు ‘ఎవడు’ హిట్ కధ అందించిన వక్కంతం వంశీని మరో కధ సిద్ధం చేయాలని కోరినట్లు టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. వంశీ కధపై నమ్మకంతో అయినా తనతో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడేమో అని ఆశపడుతున్నాడు. అటు మెగా హీరోకు కూడా వైట్లతో చేయటానికి ఇబ్బందేమి లేదు.. కాకపోతే కధ దగ్గర అసలు తంటాలు ఉన్నాయి. అందువల్ల వంశీ కథతో ప్రాజెక్టు ఓకే అవుతుందని భావిస్తున్నాడు. మరి వంశీ కధను అయినా చెర్రి మెచ్చుతాడా... లేక వైట్ల అనే కారణంగా పక్కనబెడతాడా అనేది తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ లో కమర్షియల్ ప్లస్ ట్విస్టుల కథకు వక్కంతం వంశీ పెట్టింది పేరు. ఈమద్య ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడుతున్నాయి. ఈ మద్య వచ్చిన ‘రేసుగుర్రం’ సక్సెస్ అయింది. తాజాగా ఎన్టీఆర్ - పూరీ కాంబినేషన్ సినిమాకు కధ అందించింది వంశీయే. చరణ్ కు ‘ఎవడు’ హిట్ కూడా అందించాడు. ఇలా సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్న వంశీ ద్వారా చరణ్ సినిమా చేసి.. ఐ యామ్ బ్యాక్ అన్పించుకోవాలని శ్రీనువైట్ల భావిస్తున్నారు. మరి ఈ ఆశలు ఏమవుతాయో.. ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుందా, లేదా కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది.


కార్తిక్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  srinu vaitla  vakkantham vamshi  latest updates  

Other Articles