Allu arjun comment on prabhas look in bahubali

prabhas next movie, prabhas bahubali movie updates, prabhas bahubali posters, bahubali release date, bahubali movie posters, bahubali latest updates, bahubali shooting stills, thamanna next movie, anushka in bahubali, rana movies

allu arjun comment on prabhas look in bahubali : stylish star allu arjun commented on prabhas about his look in bahubali movie says it looks best and also greets birthday wishes in advance to prabhas

బాహుబలిపై ఫస్ట్ లుక్ పై గోన కామెంట్

Posted: 10/21/2014 01:12 PM IST
Allu arjun comment on prabhas look in bahubali

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా ‘బాహుబలి’ ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న పోస్టర్ ను చూసిన ఫ్యాన్స్ సినిమాపై అంచనాలను పెంచుకుటున్నారు. అటు ఈ పోస్టర్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కామెంట్ చేశాడు. ఫస్ట్ లుక్ చూసిన బన్నీ.., ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. ‘బాహుబలిలో ప్రభాస్ లుక్స్ అద్బుతంగా ఉన్నాయి. నా డార్లింగ్ కు అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని కామెంట్ చేశాడు.

పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్, టైం టేకింగ్ తో నిర్మితమవుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో తొలి పార్ట్ విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ తో పాటు అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అటు మూవీకి ఎప్పటికప్పుడు ప్రచారం కల్పించేలా జక్కన్న కొత్త ఆలోచనలతో ప్రచారం కల్పిస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’ సినిమాలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ లో నటించాడు. తన షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసిన బన్నీ.., తెలుగు చరిత్రకు సంబంధించిన సినిమా కావటంతో రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. అనుష్క ప్రధాన పాత్రగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపుకుంటోంది. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ గా ఉన్న బన్నీ, డార్లింగ్ ఇద్దరూ హిస్టరీకి సంబంధించిన సినిమాల్లో నటిస్తున్నారు. వీరిద్దరి సినిమాలు హిస్టరీ క్రియేట్ చేయాలని కోరుకుందాం.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali  allu arjun  prabhas  latest updates  

Other Articles