Nithya menon in allu arjun film in the place of pranitha

nithya menon in allu arjun movie, nithya menon in trivikram movie, nithya menon next movie, allu arjun next movie, allu arjun movie with trivikram, trivikram upcoming movies, actress pranitha next movie, actress samantha movie with allu arjun, tollywood latest updates

nithya menon in allu arjun film in the place of pranitha : director trivikram finally selected nithya menon in the place of third heroine in his next movie with allu arjun this project presently in shooting mode

బన్నీ హీరోయిన్ గా సీనియర్ నటి... వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ

Posted: 10/21/2014 04:03 PM IST
Nithya menon in allu arjun film in the place of pranitha

మూడవ ముద్దుగుమ్మపై చిక్కుముడి వీడింది. కాంబినేషన్ మూవీలో బన్నీ పక్కన నటించే చాన్స్ ను బెంగళూరు భామ కొట్టేసింది. అప్పటివరకు ప్రచారంలో ఉన్న ప్రణిత పక్కకు తప్పుకోగా.., వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నిత్య ప్రాజెక్ట్ లోకి వచ్చేసింది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమాలో మూడవ హీరోయిన్ గా నిత్య మీనన్ ఎంపిక అయింది. నిత్యను తీసుకునేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. తాజా నిర్ణయంతో నిత్య భామ చిందులేస్తుందట.

‘జులాయి’ హిట్ తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు అని ముందు నుంచే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఫస్ట్ హీరోయిన్ గా సమంతను తీసుకున్నారు. ఇక సెకండ్ హీరోయిన్ గా ‘హార్ట్ ఎటాక్’ ఫేం అదాశర్మ కన్ఫర్మ్ అయింది. మూడవ హీరోయిన్ విషయానికి వచ్చే సరికి అనేక మార్పులు వచ్చాయి. ప్రణితను పరిశీలించాక మళ్ళీ రెజినాతో అయితే రెడి అన్నారు. ఆ తర్వాత మరొకరు., చివరకు ఎవరూ ఎంపిక కాలేదని చెప్పారు. ఇన్ని సస్పెన్స్ ల మద్య ఎట్టకేలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నట్లుగా అనుకోకుండా నిత్యమీనన్ కు అవకాశం ఎగురుకుంటూ వచ్చింది.

నిత్య మీనన్ అయితేనే ఆ పాత్రకు సరైన న్యాయం చేయగలదు అని భావించి అమ్మడిని సంప్రదించి యు ఆర్ సెలక్టెడ్ అనేశారట. ఇంకేముంది అల్లు అర్జున్ సినిమాలో.., అదీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అని తెలుసుకుని సంబరపడిపోయిన నిత్య మీనన్.., బన్నీ సినిమా కోసం తన డేట్లను అడ్జస్ట్ చేసేందుకు కూడా అంగీకరించిందట. వయస్సు ప్రకారం చూసినా.., ఇండస్ర్టీ సినిమాల అనుభవం లెక్కన చూసినా ప్రణిత కంటే నిత్య చాలా సీనియర్. జూనియర్ గ్లామర్ ను కాదని మరీ... త్రివిక్రమ్ సీనియర్ ను పట్టుకున్నారు. మరి అంతగా సస్పెన్స్ క్రియేట్ చేసిన ఆ పాత్ర ఏమిటో చెప్పమంటే సినిమా చూడండి అని త్రివిక్రమ్ తన శైలిలో డైలాగులు చెప్తున్నాడు.

ఇక ఈ కాంబినేషన్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు స్నేహ నటిస్తోంది. అంటే మొత్తం నలుగురు హీరోయిన్లు.., ఇద్దరు హీరోల ఇందులో నటిస్తున్నారన్నమాట. తెలుగులో సంచలనాత్మక హిట్ సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లతో బన్నీ ఎలా మ్యానేజ్ చేశాడా అని తెగ చర్చించుకుంటున్నారు. వీటన్నిటికి సమాధానం తెలియాలంటే త్రివిక్రమ్ చెప్పినట్లు సినిమా చూడాల్సిందే.

కార్తిక్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithya menon  allu arjun  trivikram srinivas  latest updates  

Other Articles