Music director yuvan shankar raja clarification on changing his religion to islam

music director yuvan shankar raja, music director ilayaraja, yuvan shankar raja latest news, ilayaraja latest news, yuvan shakar raja ilayaraja, islam religion, yuvan shankar raja islam news

music director yuvan shankar raja clarification on changing his religion to Islam : The ace Indian music director ilayaraja son yuvan shankar raja finally gives clarification that why he converts to islam from hindu.

ఇళయరాజా కొడుకు యువన్ ముస్లిం ఎందుకయ్యాడు?

Posted: 08/13/2014 01:14 PM IST
Music director yuvan shankar raja clarification on changing his religion to islam

భారతీయ చిత్రపరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఇళయరాజా చిన్న కొడుకు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా... ఈ ఏడాది మొదట్లో ఇస్లాం మతాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే! అయితే అప్పట్లో ఈయన తన మతం మారడంపై ఎన్నో వివాదాలు రేగాయి. తన తండ్రి కూడా ఇందుకు అస్సలు అంగీకరించలేదు. అయినా కూడా ఈయన పట్టుబడి మరీ ఇస్లాం మతాన్ని అంగీకరించాడు. దాంతో ఆయన మతం మారడానికి గల కారణాలేంటో వివరణ ఇవ్వాల్సిందిగా అందరూ కోరడంతో చివరికి ఈయన పెదవి విప్పారు. మొదట ఇందుకు యువన్ శంకర్ తిరస్కరించినా... వివాదాలు వస్తున్న నేపథ్యంలో చాలారోజుల తర్వాత దీని మీద స్పష్టతనిచ్చారు.

మూడేళ్ల కిందట అంటే 2011లో తన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడం వల్ల బాగా దగ్గుతుండటంతో వెంటనే యువన్ కారులో హాస్పిటల్ కు తీసుకువెళ్లాడట! అయితే డోరు ఓపెన్ చేసి ఆమెను లోపలకు తీసుకువెళ్లే సమయంలోనే తుదిశ్వాస విడిచేసింది. దీంతో మానసికంగా బాగా కుంగిపోయిన యువన్.. ఎడతెరిపి లేకుండా నిత్యం ఏడ్చేవాడట! తన తల్లి చనిపోయిందనే బాధలో ఏం చేసేవాడో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో వుండిపోయేవాడని పేర్కొన్నాడు. చివరికి తాను రెండోసారి డైవోర్స్ ఇచ్చినట్లు తెలిపాడు. తల్లి చనపోయిందన్న బాధతో ఏకంగా శూన్యంలోకి వెళ్లిపోయినట్లు ఆయన వెల్లడించాడు.

ఆ సమయంలోనే మక్కా వెళ్లి వచ్చిన తన స్నేహితుడు.. అక్కడి దేవుడి దగ్గర వుంచే ఒక తివాచీని తనకు ఇచ్చాడట. ఆందోళనకరంగా వున్నప్పుడు అందులో కూర్చుంటే చాలా హాయిగా అనిపిస్తుందని అతను చెప్పడంతో 7నెలలపాటు అలాగే చేశాడట! అయితే తన తల్లి చనిపోయిందన్న బాధ నిత్యం గుర్తుకు వస్తుండటంతో.. ఒకరోజు తన స్నేహితుడు తానిచ్చిన తివాచీ మీద కూర్చొని ఖురాన్ చదవాల్సిందిగా సలహా ఇచ్చాడట! దాంతో అప్పటి నుంచి ఖురాన్ చదవడం మొదలుపెట్టిన యువన్ కు మనస్సులో ప్రశాంతత అలుముకోవడం మొదలైందని.. అప్పటి నుంచి ముస్లింగా మారాలని నిశ్చయించుకున్నట్టు అతను వివరణ ఇచ్చాడు. అలా ఆ విధంగా తాను ఇస్లాం మతాన్ని స్వీకరించాడని యువన్ శంకర్ రాజా విశదీకరించాడు. ఈ విషయంలో తన తండ్రి ఇళయరాజా వ్యతిరేకంగా వున్నప్పటికీ.. తన సోదరుడు, వదిన మాత్రం మద్దతుగా పలికినట్లు ఆయన చెప్పాడు.

నిజానికి ఇళయరాజా, ఆయన సతీమణి బహునిష్టతో నిత్యం దేవుళ్లను కొలిచే హిందువులు. ఇంట్లో ఏ శుభకార్యక్రమం జరిగినా, అశుభం జరిగినా వెంటనే పూజారులను పిలిపించి, పూజలు నిర్వహించేవారట! అంతెందుకు.. చివరికి ఇంట్లో వున్న చిన్న గ్లాస్ పగిలినా అందుకు తమ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఆవహించిందనే అనుమానంతో పూజా కార్యక్రమాలను చేయించేవారట! అయితే ఇస్లాం తనను ఆకట్టుకున్నట్టు ఇవేవీ తనకు అంతగా పనిచేయలేదని అంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇస్లాం మతానికి అనుగుణంగా తాను పేరు మార్చుకుంటున్నట్టు అతను పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles