Rani mukherjee comments gif

rani mukherjee, rani mukherjee pregnant news, rani mukherjee comments, rani mukherjee hot photos, rani mukherjee mardani movie, mardani movie trailer

Rani mukherjee speaks about her pregnant rumours : bollywood actress rani mukherjee speaks about her pregnant rumours. She said that those rumours wants becomes true.

ఆ రూమర్లు నిజమే అవ్వాలని కోరుకుంటున్నా! రాణి

Posted: 08/13/2014 11:36 AM IST
Rani mukherjee comments gif

సాధారణంగా ఏ తారలమీదైనా రూమర్లు వస్తే వారు దానికి లైట్ గా తీసుకుంటారు లేదా తీవ్రంగా ఖండిస్తారు. మరికొందరు ఓవర్ రియాక్ట్ అయి సదరు రూమర్ల మీద కేసులు కూడా వేస్తుంటారు. కానీ రాణి ముఖర్జీ మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. తనపై వచ్చిన రూమర్లను స్వాగతిస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. తనపై వస్తున్న రూమర్లు నిజమే కావాలంటూ ఆమె కోరుకుంటోంది. పైగా అందుకు అందరి ఆశీర్వాదాలు కావాలంటూ ఆమె పేర్కొంటోంది.

ఇటీవలే రాణిముఖర్జీ బాలీవుడ్ లో అగ్రనిర్మాత అయిన ఆదిత్య చోప్రాను రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే! వీళ్లద్దరూ పెళ్లిచేసుకోకముందు వీరి రహస్య సంబంధం మీద రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. పెళ్లి చేసుకోకుండా సహజీవనం కొనసాగిస్తున్నారంటూ ఎన్నోరకాల వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా రాణిముఖర్జీ ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. రాణిముఖర్జీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆమె నిజంగానే ప్రెగ్నెంట్ అయిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

రాణిముఖర్జీ తాజాగా నటించిన ‘‘మర్దానీ’’ చిత్రం ప్రమోషన్ కోసం రకరకాల టీవీ షోలలో పాల్గొంటోంది. అందులో భాగంగానే ఈ అమ్మడు ‘‘ఝలక్ దిఖ్లాజా’’ షోకు హాజరయ్యింది. ఆ డ్యాన్స్ షో కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా మాధురీ దీక్షిత్ వ్యవహరిస్తోంది. రాణీ ఈ షోకు విచ్చేసిన వెంటనే మాధురీ ఆమెకు చాలా సేవలు చేసింది. ఆమెకోసం ప్రత్యేకంగా ఒక కుర్చీని ఏర్పాటు చేయించింది. ఆ కుర్చీ ఎలా వుంటుందంటే.. అందులో కూర్చున్నవారు వెనక్కు వాలీ, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే తనకు సపోర్ట్ గా వుండేవిధంగా ఓ దిండును కూడా అందించింది. దీంతో రాణి ముఖర్జీ ప్రెగ్నెంట్ అయిందా..? అంటూ అనుమానాలు రేకెత్తడం మొదలయ్యాయి. రాణీ స్టేజ్ పై వస్తుండగా మాధురీతోపాటు షో ప్రెజెంటర్లు కూడా ఆమెకు సహాయం చేయడం జరిగింది. దీంతో ఈ అమ్మడు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయిందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దీంతో రాణి ప్రెగ్నెంట్ అయిందంటూ బాలీవుడ్ లో వార్తలు జోరందుకున్నాయి.

తనపై వస్తున్న ఈ ప్రెగ్నెంట్ రూమర్లను విన్న అనంతరం రాణి ముఖర్జీ తాజాగా స్పందించింది. ఇటీవలే ఇంటర్వ్యూలో పాల్గొన్న రాణి ముఖర్జీ... తనపై వస్తున్న ప్రెగ్నెంట్ రూమర్లు నిజం కావాలని తాను కూడా కోరుకుంటున్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఓ బిడ్డకు జన్మనివ్వడమనే విషయం కంటే మహిళ జీవితంలో మరో గొప్ప విషయం ఏముంటుందనే సంతోషాన్ని ఆమె వెల్లడించింది. గతంలో ఆమెకు ఆదిత్యతో పెళ్లి కాకముందు ఎన్నోరకాల రూమర్లు వచ్చాయని.. ఆ విధంగా వార్తలొచ్చిన నేపథ్యంలోనే తాము పెళ్లి చేసుకున్నట్లు రాణి చెప్పింది. ఇప్పుడు తాను ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తలు కూడా నిజం కావాలంటూ కోరుకుంటున్నానని వెల్లడించింది. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు వింటుంటే.. మొత్తానికి రాణి ప్రెగ్నెంట్ అయిన విషయం నిజమేనంటూ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rani mukherjee  rani mukherjee pregnant  mardani movie  jhalak dikhlaja show  

Other Articles