Alludu seenu movie is set to release on july 25

bellam konda srinivas alludu seenu movie is set to release on july 25, Alludu sreenu new movie stills, alludu sreenu movie news, bellamkonda srinivas in alludu sreenu movie, alludu sreenu movie release date, alludu sreenu movie review, alludu sreenu movie review news, alludu sreenu movie release, alludu sreenu movie story, alludu sreenu movie photos, samantha in alludu sreenu movie

bellam konda srinivas new movie alludu seenu is set to release on july 25

కొత్త ‘‘అల్లుడు’’... మెరుపు వేగంతో దూసుకుపోతాడట!

Posted: 07/22/2014 12:13 PM IST
Alludu seenu movie is set to release on july 25

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరయిన బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘‘అల్లుడు శీను’’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే! ఇందులో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన చెన్నై బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో.. ఎందరో ముఖ్యనటులు నటిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ హీరోల రేంజిలో దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టు సమాచారం!

ఈ సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతో అద్భుతంగా నటించాడంటూ సహనటులతో సహా, డైరెక్టర్ వినాయక్, సమంత కూడా కితాబిచ్చారు. శ్రీనివాస్ తాను హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం అయినప్పటికీ... అతను కొత్తవాడిలాగా కాకుండా పాత హీరోగానే అద్భుత నటనను ప్రదర్శించాడని ప్రతిఒక్కరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇందులో ఇతన యాక్టింగ్, డాన్స్, స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని వారు పేర్కొంటున్నారు.

ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్న ప్రకాష్ రాజ్ కూడా బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ఎన్నో ప్రశంసలు చేశారు. శ్రీనివాస్ లాంటి కొత్త హీరోతో కలిసి నటించడం తనకు చాలా సంతోషంగా వుందంటూ ఆయన పేర్కొన్నారు. అలాగే.. ‘‘బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి సినిమాలో హీరోగా నటిస్తున్నప్పటికీ... అతను ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. ఒక సీనియర్ హీరోకు వున్న లక్షణాలన్నీ ఈ కుర్ర హీరోలో పుట్టుకతోనే వున్నాయి. ఎటువంటి భయం, బిడియం లేకుండానే సెట్స్ మీద అద్భుతంగా నటించాడు. అతను యాక్టింగ్ లో తనదైన ప్రతిభను ప్రదర్శించాడు. తనకు యాక్షన్ గురించి కానీ, యాక్టింగ్ గురించి కానీ పాఠాలు నేర్పించడానికి ఒక డైరెక్టర్ గైడెన్సీ అవసరం లేదు’’ అంటూ ఆయన అభిప్రాయాలను వెల్లడించారు.

అలాగే... ‘‘శ్రీనివాస్ లాంటి కొడుకును కన్నందుకు బెల్లంకొండ సురేష్ కూడా ఎంతో గర్వపడతాడు. మొదట వినాయక్ ఈ కొత్త హీరోను సరిగ్గా హ్యాండిల్ చేయలేడు అని అనుకున్నాను. అతనికి మొదటి సినిమాతోనే పెద్ద బ్రేక్ ఇవ్వలేడని భావించాను. శ్రీనివాస్ కూడా కొత్తవాడు కాబట్టి నటన మీద పట్టు వుండదనుకున్నాను. కానీ నేను ఆలోచించింది మాత్రం చాలా తప్పు. వినాయక్ లాంటి దర్శకుడే శ్రీనివాస్ లాంటి కొత్త హీరోలకు సరైనవాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని పేర్కొన్నాడు.

ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. మాస్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ లతో కూడిన ఈ సినిమాలో ఎందరో ప్రముఖ నటులు నటిస్తున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడి లాంచింగ్ కోసం ఇప్పటికే 50కోట్ల వరకు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ సినిమా... భారీ అంచనాల మధ్య జూలై 26వ తేదీన రిలీజ్ కాబోతోంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని సాధించి, చిత్రపరిశ్రమలో తనదైన ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని కోరుకుంటోంది మా ‘‘తెలుగు విషేష్’’!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles