Yami gautham loses chance to act with akshay kumar

Yami gautham loses chance to act with akshay kumar in shoukeen movie for not looking sexy in bikini, yami gautham latest news, yami gautham hot photo shoot, yami gautham in gouravam movie, yami gautham in bikini, yami gautham hot photos, yami gautham news, yami gautham latest photos, yami gautham with akshay kumar, yami gautham loses chance with akshay kumar

Yami gautham loses chance to act in shoukeen movie

బికినీ వేసుకున్నా.. ఛాన్స్ మిస్సయింది!

Posted: 07/22/2014 11:01 AM IST
Yami gautham loses chance to act with akshay kumar

ప్రస్తుతకాలంలో సినిమాల్లో ఏవిధంగా అయితే లిప్ లాక్ సన్నివేశాలు చాలా ముఖ్యమయిపోయాయో... అదేవిధంగా బికినీలు వేసుకోవడం కూడా పద్ధతిగా మారిపోయింది. యువహీరోయిన్ల నుంచి సీనియర్ నటులందరూ తమతమ అదృష్టాల్ని పరీక్షించుకునేందుకు చాలామంది బికీనల్లో దర్శనమిచ్చారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే చాలా హాట్ గా కనిపిస్తే.. మరికొంతమంది మాత్రం అంతగా రక్తి కట్టించలేకపోయారు. ఎన్నిసార్లు బికీనీలు వేసుకుని సినిమాల్లో నటించినా.. వారికి అదృష్టం మాత్రం వరించలేదు.

ఇప్పుడు తాజాగా ‘‘గౌరవం’’ మూవీ ఫేమ్ యామీ గౌతమ్ పరిస్థితి కూడా అలాగే వున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా ‘‘షౌకీన్’’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! మొదట ఇందులో కథానాయికగా యామీని సెలక్ట్ చేసుకున్నారు. ఏమయిందో ఏమోగానీ ఆమెను ఆ ప్రాజెక్టు నుంచి వెంటనే తొలిగించి, సెక్సీ తార అయిన లిసా హేడెన్ ను సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం!

అందుకు కారణం ఏమిటా అని తీరా ఆరాతీస్తే... కేవలం బికినీయే అంటూ అందరూ సమాధానం ఇచ్చారు!!! ‘‘షౌకీన్’’ మూవీ యూనిట్ సభ్యులు తొలుత యామీ గౌతమ్ ను తీసుకున్నప్పటికీ ఆమె శరీర సౌష్టవం అంతగా బాగోలేదని పేర్కొన్నారట! అందుకు ఆమెను డైరెక్ట్ గా మూవీలోంచి తీసేయకుండా ఈమెకు, సెక్సీతార లీసా హేడెన్ కు మధ్య ఎవరు హాట్ గా కనిపిస్తారోనని ఒక చిన్న టెస్ట్ పెట్టారట! అందుకు వారిద్దరినీ బికినీలో తమ అందాలను ప్రదర్శించాలని కోరాయట ఆ యూనిట్ వర్గాలు!

దీంతో ముందుగా లిసా హేడెన్ బికినీ ధరించుకుని తన హాట్ అందాలను దర్శకనిర్మాతల ముందు పరిచేసింది. ఇక యామీ గౌతమ్ దగ్గరకు వస్తే.. దక్షిణాది కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం వల్ల మొదట్లో సిగ్గుపడింది. అయినప్పటికీ బికినీ వేసుకుని తన అందాలను ప్రదర్శించినా... దర్శకనిర్మాతలను అంతగా ఆకర్షించలేకపోయిందట! దీంతో ఈమె ప్రేక్షకులను ఎలా రక్తి కట్టిస్తుందంటూ ఆ చిత్రం నుంచి తొలగించి లిసా హేడెన్ ను తీసుకున్నారు. దీంతో యామీకి అక్కీతో నటించే ఛాన్స్ మిస్సయిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles