Vv vinayak starts in film production

Director VV Vinayak, VV Vinayak new film production, VV Vinayak plans film production, VV Vinayak encourage small films, VV Vinayak encourage new talent

VV Vinayak starts in Film Production

కాసుల కోసం రూట్ మార్చేశాడు....

Posted: 07/10/2014 02:54 PM IST
Vv vinayak starts in film production

టాలీవుడ్ లో హిట్ దర్శకుడిగా పేరు తెచ్చకున్న వి.వి. వినాయక్ టాప్ డైరెక్టర్లలో ఒక్కడే కాకుండా, భారీ రెమ్యునరేషన్ తీసుకునే వాడిలో ఒక్కడు కూడా. బాగా డబ్బులు సంపాదించాక చాలా మంది సొంత బ్యానర్లు పెట్టుకుంటూ మరిన్ని కాసులు సంపాదించుకునే మార్గం చూసుకుంటున్నారు.

ఇప్పటికే చాలా మంది దర్శకులు ఈ రూట్లోకి వస్తే ఇప్పుడు వినాయక్ కూడా వచ్చి చేరబోతున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి ‘కోటి ’ సంపాదించుకుంటే చాలనుకున్న వినాయక్ ఇప్పుడు కోట్లకు కోట్లు సంపాదించి ఖరీదైన బంగ్లాలు, కార్ల కొనుక్కొని లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈయన త్వరలో సొంత నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నారు.

ఈ బ్యానర్లో కొత్త టాలెంటును ఎంకరేజ్ చేయడానికే తాను సినీ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు వివి వినాయక్. ఇటీవలే ఇల్లు కట్టుకున్న ఈయన ఈ సంస్థను స్థాపించడానికి మరో ఏడాది సమయం తీసుకుంటారని తెలుస్తుంది. తొలుత ఈ బ్యానర్లో చిన్న సినిమాలు నిర్మించాలనే యోచనలో ఉన్న వినాయక్, కొత్త నటీనటులకు అవకాశాల కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రొడక్షన్ పని చేయనుందని తెలుస్తోంది. కొత్త వారికి అవకాశాలు ఇచ్చి, వారి ద్వారా మరింత ఆదాయం సంపాదించుకోవాలనే ఆలోచనతోనే ఈ బ్యానర్ ఆలోచన చేస్తున్నాడని సినీ జనాలు అనుకుంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles