Hrithik roshan 50 cr for mohenjodaro movie

Hrithik Roshan 50 cr for MohenjoDaro Movie, Hrithik Roshan Highest Paid Bollywood Actor in Btown, mohenjodaro, Manoj-Desai,Hrithik-Roshan, Bollywood, Bang-Bang, Ashutosh-Gowariker, Amod-Mehra

Hrithik Roshan 50 cr for MohenjoDaro Movie

రికార్డు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు ?

Posted: 07/10/2014 05:24 PM IST
Hrithik roshan 50 cr for mohenjodaro movie

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాల రెమ్యునరేషన్ గురించి, నెంబర్ స్థానాల గురించే చర్చ జరుగుతుంటుంది. ఆ లెక్కన చూసుకుంటే బాలీవుడ్ లో సల్మాన్, షారూఖ్, అమీర్ , హృతిక్ ల పేర్లు వినిపిస్తాయి. కానీ పారితోషికంలో మాత్రం తేడాలు ఉంటాయి. అలాగే సౌత్ లో రజినీ, కమల్ పేర్లు చెబుతారు. వీరి పారితోషికం కూడా ముఫ్పై కోట్ల పై మాటే. గతంలో ‘రోబో ’ సినిమా కోసం రజినీ దాదాపు యాభై కోట్లు తీసుకున్నాడనే ప్రచారం జరిగింది.

టాలీవుడ్ పవన్, మహేష్ , ఎన్టీఆర్ లు టాప్ లో ఉన్నారు. సౌత్ మాట పక్కన పెడితే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రంలో పోషిస్తాడని చెబుతున్న పాత్రకి అతడు రికార్డు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడట. ఆ పాత్ర తెరమీదకొస్తే, బాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ల జాబితాలో ఈయన కూడా అగ్రపీఠమెక్కుతాడట.

హృతిక్ తో సంచలన దర్శకుడు అశుతోష్ గోవారికర్ ‘మొహింజదారో ’ చిత్రం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గాను అతడికి రూ. 50 కోట్ల మేర రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు అశుతోష్ సిద్దపడ్డట్లు బాలీవుడ్ టాక్. భారీగా కాల్షీట్లు కేటాయించాల్సిన అవసరం ఉండటంతో దానికి తగ్గట్లే రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ద పడుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రస్తుతం కత్రినా కైఫ్ తో కలిసి చేస్తున్న ‘బ్యాంగ్ బ్యాంగ్ ’ తరువాత ఈ చిత్రంలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ కి కూడా బాగానే ముట్టజెప్పుతారని ఇట్టే అర్థం అవుతుంది. దీనిని బట్టి చూస్తే సినిమా బట్జెట్ ఎంతో మరి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles