Indian stock market effected by China market

Indian stock market effected by china market

China stock markets closed for the day less than half an hour after opening on Thursday when shares fell more than seven percent, triggering an automatic "circuit breaker". By 9.58am, when the market halted trading, figures showed the benchmark Shanghai Composite Index had slumped 7.32 percent, or 245.95 points, to 3,115.89.

చైనా దెబ్బకు మన మార్కెట్లు పతనం

Posted: 01/07/2016 06:13 PM IST
Indian stock market effected by china market

వరుస పతనాలతో మదుపరులు బెంబేలెత్తుతున్నారు. జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ ఏడాది గత సోమవారం తొలి భారీ పతనం నమోదైంది. సెన్సెక్స్ 537, నిఫ్టీ 171 పాయింట్లు కోల్పోయాయి. సింపుల్ గా ఓ లక్షన్నర కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. నేడు కూడా మళ్లీ అదే పునరావృతమైంది. ఇంకేముంది. మరో లక్షన్నర కోట్ల మదుపురుల సొమ్మ హారతి కర్పూరమైపోయింది. స్టాక్ మార్కెట్లపై డ్రాగన్ దాడి ఫలితమిది. భారత్ సహా ఆసియా మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఉదయం 25,406 పాయింట్ల దగ్గర మొదలైనప్పటి నుంచి బీఎస్ఈ సెన్సెక్స్ పతనం ప్రారంభమైంది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని 554 పాయింట్లు కోల్పోయి 24,851 వద్ద ముగిసింది.

నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ -నిఫ్టీది కూడా అదే కథ. 7,741 పాయింట్ల వద్ద మొదలైన నిఫ్టీ 172 పాయింట్లు కోల్పోయి 7,568 వద్ద ముగిసింది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 170 పాయింట్లు పతనమైంది. దీంతో మదుపుదారుల మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నిఫ్టీలోని దాదాపు ఎక్కువగా శాతం షేర్లు నష్టాల్లో పయనించాయి. ఫార్మా, ఆటోమొబైల్, కమ్యూనికేషన్స్, ఐటీ, ఆయిల్, బ్యాంకింగ్, మెటల్, సిమెంట్ ఇండెక్స్ లు పతనాన్ని చవిచూశాయి. ఆసియా పెద్దన్న చైనా మార్కెట్లు అధఃపాతాళానికి పడిపోవడంపోపాటు రూపాయి విలువ తగ్గడం కూడా భారత మార్కెట్లపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ డాలర్ పోలిస్తే 66 దగ్గర ట్రేడ్ అయింది. ఇది ఇన్వెన్టర్లలో భయాందోళనలను రేకెత్తించింది. అమ్మకాల ఒత్తిడిని మరింత పెంచింది. ఫలితమే ఈ నష్టాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles