Winter skin problems heavy face wash tips

winter health problems, winter skin problems, winter health problems and solutions, winter health problems updates, skin problems and solutions, skin beauty tips, moisturisers harm problems on skin, skin diseases treatment, latest news updates

winter heavy face wash leads skin problems : with weather changes and decreased temperatures lead skin to dry and itchy. dont wash face frequently in winter it will harm and bring skin problems fallow tips to reduce problems

చలికాలంలో ఎక్కువగా ముఖం కడగటం చాలా తప్పు

Posted: 12/18/2014 04:40 PM IST
Winter skin problems heavy face wash tips

ముఖం కడిగితే మురికిపోయి నీట్ ఉంటాము అనుకోవటం సహజం. ఇది కరెక్టే కానీ చలికాలంలో మాత్రం తరుచుగా ముఖం కడగటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల చర్మంపై దురద, పగుళ్ళు ఎక్కువగా వస్తాయి. కాబట్టి తరుచుగా ముఖం వాష్ చేయటం వల్ల మంట వచ్చి ముఖం ఎర్రగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖం కడగటం తగ్గించటంతో పాటు.., చలికాలంలో ముఖం కడిగే టప్పుడు పాటించాల్సిన చిట్కాలేమిటో చూద్దాం.

ఫేస్ వాష్ క్రీముల ఎంపిక : ముఖం నీటుగా ఉంచుకునేందుకు ఏవేవో క్లెన్సర్లు ఉపయోగిస్తుంటాము. అయితే ఇవన్నీ చలికాలంలో పనిచేయటం అటుంచితే హాని ఎక్కువగా కల్గిస్తాయి. కాబట్టి.., టట్రీ ఆయిల్ లేదా సలిసిలిక్ ఆయిల్ తో తయారైన క్లెన్సర్స్ అయితే ఉత్తమం.

మాయిశ్చరైజర్ ఉపయోగించటం : సాధారణంగా చలికాలంలో బయటకు వెళ్లేటపుడో లేదా.., పడుకునే సమయంలోనే మాయిశ్చరైజర్ ఉపయోగిస్తాము. కాని తెలియని విషయం ఏమంటే.., ముఖం కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల ముఖం పొడిబారి దురద వచ్చే అవకాశం తక్కువ.

రాత్రి పడుకునే ముందు ముఖం కడగాలి : చర్మంపై దుమ్ము, దూళి ఉంటుందన్న విషయం తెలిసిందే. పడుకునే ముందు ముఖంను శుభ్రం చేసుకోకపోతే.., ఇది అలాగే ఉండి చర్మాన్ని పాడు చేస్తుంది. కాబట్టి పడుకునేముందు ఖచ్చితంగా ముఖాన్ని కడగాలి. ఇక ముఖం కడిగాక ఎలాగూ మాయిశ్చరైజర్ రాసుకోవాలని చెప్పాము.

మంచి టవల్ వాడాలి : ముఖం కడిగిన తర్వాత మురికిగా ఉన్న టవల్ తో తుడుచుకుంటే.., మన కష్టం, ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అప్పటికే టవల్ పై మురికిలో ఉన్న క్రిములన్నీ మళ్ళీ ముఖానికి వచ్చి అంటుకుని ప్రయోజనం ఉండదు. కాబట్టి నీట్ గా ఉండే టవల్ వాడాలి.

ముఖానికి వేడినీళ్లను వాడకండి : చలిని తట్టుకోలేక స్నానం, ముఖం కడిగేందుకు వేడి నీళ్లను అందరూ ఉపయోగిస్తుంటారు. స్నానానికి అయితే తప్పదు కాబట్టి ఉపయోగించాలి. కాని ఇదే బద్దకం ముఖం విషయంలో పాటిస్తే.., ముడతలు వస్తాయి. కాబట్టి చల్లని నీళ్ళతో ముఖం కడగండి. తప్పదనకుంటే గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. అంతేకానీ వేడి నీటిని ముఖానికి తాకనివ్వకండి.

వీటితో పాటు చర్మం తీరును బట్టి, మాయిశ్చరైజర్లు, లోషన్లు, క్రీములు వాడవచ్చు. కానీ వాటిలో కలిపే రసాయనాలు, వాటి గాఢతలు తెలుసుకుని వాడండి. లేకపోతే సౌందర్య లేపనాలతో అందం రావటం అటుంచితే.., అంద విహీనంగా తయారవుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : skin problems and solutions  winter problems  face wash benefits  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more