ఎలాంటి చర్మ తత్త్వం కలవారయినా , ఎండా కాలం లో కష్ట కాలం యెదురుకొక తప్పదు . సూర్యుని ప్రతాపాన్ని తట్టుకోవడం కష్టం కదా , మరి ఇదే ప్రభావం చర్మం పై కూడా పడి , వేడి పొక్కులు భాదిస్తాయి . ఈ బెడద నుండి పరష్కారం ఇలా పొందచ్చు ;
ఈ కాలం లో వీలయినంత ఎక్కువగా మంచి నీళ్ళు తాగటం అలవాటు చేసుకోవాలి . తరచూ స్నానం చెయ్యడం ఉత్తమం . వీలయినంత వరకు , ఎక్కువ రసాయనాలతో చేసే సబ్బుల జోలికి పోకుండా , హెర్బల్ బాత్ పవుడర్లు , సెనగ పిండి వాడటం ఉత్తమం . ఎండ వేడి బాధించి , చర్మం కందిపోయినట్టు గా అయినట్లయితే , చల్లని నీళ్ళల్లో చెంచాడు వంట సోడా వేసి , మెత్తని గుడ్డని ఇందులో ముంచి , ముఖం , మెడ తుడుచుకుంటూ ఉండాలి .
చందనం పొడి , రోజ్ వాటర్ కలిపి , ముఖానికి మెడకి రాసుకున్నా కూడా , మంచి ఫలితం ఉంటుంది . సెనగ పిండి వొంటికి పట్టించి స్నానం చెయ్యడం వల్ల , చాలా సమయం వరకు చెమట పట్టకుండా , చెర్మం ఫ్రెష్ గా ఉంటుంది .
పుచ్చకాయ , కీర దోస వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల , వొంట్లో అధిక వేడిని నివారించడమే కాదు , సూర్యుని వేడిని తట్టుకునే శక్తి కూడా మనలో పెంపొందుతుంది . తరచూ , ఓట్ మిల్ పొడిని రాసుకోవటం వల్ల , చెమట , దుర్వాసన అదుపులో ఉంటాయి .
నోటికి రుచిగా ఉండి , తక్షణ ఉపసమనాన్ని ఇచ్చి , తరువాత మన ఆరోగ్యాన్ని ఇరకాటం లో పడేసే కూల్ డ్రింకుల కన్నా , తాజా పళ్ళ రసాలు , చెరుకు రసం వంటివి ఎంతో మిన్న .
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more