Great mosque of samarra building history iraq news

Great Mosque of Samarra, samarra mosque, samarra masjid, Great Mosque of Samarra news, Great Mosque of Samarra photos, Great Mosque of Samarra history, Great Mosque of Samarra biography, Great Mosque of Samarra making, samarra masjid photographs

Great Mosque of Samarra building history iraq news : the great mosque of samarra which is built in 9 century by ruler abbasid khaleef al mutavakki

9వ శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధ సమర్రా మస్జిద్

Posted: 11/26/2014 12:49 PM IST
Great mosque of samarra building history iraq news

చరిత్రలో నిర్మించిన కొన్ని చారిత్రాత్మత కట్టడాలు కొన్ని అద్భుతాలతో కూడి వుంటాయి. బయటనుంచి నిర్మాణం ఒకరకంగా వుంటే.. లోపలినుంచి అందుకు భిన్నంగా నిర్మించబడి వుంటాయి. పైగా నాటికాలంలోని కట్టడాలతో పోల్చుకుంటే అవి ఎంతో ధృఢంగా వుండటంతోపాటు అద్భుత కళను కలిగి వుంటాయి. అటువంటి అద్భుత కట్టడాల్లో ‘‘సమర్రా మస్జిద్’’ లేదా ‘‘గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా’’ ఒకటి! దీనిని దూరం నుంచి చూస్తే కేవలం ఒక అత్యంత ఎత్తైన భారీ స్తంభంలా కనిపిస్తుంది కానీ దగ్గరనుంచి చూస్తే మాత్రం మెలికలు తిరిగి భవంతిలా అందరినీ అబ్బురపరుస్తుంటుంది. ఇది చూడ్డానికి సాధారణ నిర్మాణంలా కనిపిస్తుంది.. నిజానికి అదొక మసీదు. ఇరాక్ దేశంలో ఉన్న ఒక అద్భుత కట్టడాన్ని యునెస్కోవారు ‘‘ప్రపంచ వారసత్వ కట్టడం’’గా ప్రకటించారు.

విశేషాలు :

1. ఈ అద్భుతమైన మసీదు భవంతిని 9వ శతాబ్దపు కాలానికి చెందిన పాలకుడు అబ్బాసిద్ కలీఫ్ ఆల్ ముతవక్కీ తన హయాంలో నిర్మించారు. దీని నిర్మాణం క్రీ.శ. 848లో ప్రారంభమైతే 851లో పూర్తయ్యింది. అంటే దీనిని నిర్మించేందుకు మొత్తం 3 సంవత్సరాలకాలం పట్టిందన్నమాట! స్తంభంలా కనిపించే దీని ఎత్తు 170 అడుగులు అంటే 15 అంతస్థుల భవనమంతన్నమాట! దీంతో అప్పట్లో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మసీదుగా కీర్తించబడింది. దీని చుట్టు కొలత 100 అడుగుల పైనే!

2. ఈ భవనం పూర్తి పైభాగంలో ఒక మసీదు వుంటుంది. అయితే పైకెళ్లడానికి ప్రత్యేకంగా మెట్లు వుండవు. భవనం గోడలనే ర్యాంప్‌లా కట్టడంతో దానిపై నుంచే నడుచుకుంటూ వెళ్లడం ఇక్కడి ప్రత్యేకత. ఈ మసీదు లోపలికెళ్లడానికి 17 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ మసీదు లోపల కూడా చక్కని ఇస్లామిక్ నిర్మాణశైలితో ప్రాచీన కళాకృతులు, చెక్కుళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

3. ఈ మసీదు నిర్మాణం అనంతరం కొన్నాళ్ల తర్వాత ఎన్నోసార్లు దీనిపై దాడులు జరిగాయి. అయితే ఆ భవనం మాత్రం కూలిపోకుండా అలాగే వుండిపోయింది. అప్పట్లోనే కాదు.. 2005లో కూడా దీనిపై బాంబు దాడి జరిగింది. అప్పుడు ఆ భవనం మొత్తం కూలిపోలేదు కానీ.. కొద్దిమేరకు మాత్రమే నష్టం జరిగింది. దాంతో మళ్లీ మరమ్మతులు చేసి పూర్వవైభవం తీసుకొచ్చారు. ఈ మసీదును అనుకరిస్తూ ఈజిప్టుతోపాటు ఎన్నో ప్రాంతాల్లో దీని నమూనాల్లో మసీదులు కట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles