Papi hills special story national park sriram ashram shiva temple andhra kashmir

papi hills special story, papi hills national park, indian national park, papi hills indian national park, andhra kashmir, sri ram ashrams, god shiva temples, papi hills story, papi hills history, godavari river, indian national parks, papi hills tourism

papi hills special story national park sriram ashram shiva temple andhra kashmir

‘జాతీయపార్కు’గా గుర్తించబడిన పాపికొండల పర్వతశ్రేణి...

Posted: 11/22/2014 03:05 PM IST
Papi hills special story national park sriram ashram shiva temple andhra kashmir

పాపికొండలు... భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటిలో ఎంతో భిన్నమైనది. ఇతర ప్రదేశాల్లో ఏదో ఒక లోటు వుండవచ్చు కానీ.. ఈ పాపికొండల్లో అటువంటి అనుభవాలు అస్సలు ఎదురుకావు. పర్యాటకప్రాంతాల్లోకెల్లా దీనిని ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశంగా అభివర్ణిస్తారు. ఇక్కడి ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము ఎంత అద్భుతంగా వుంటాయంటే... ఈ ప్రదేశాన్ని ‘‘ఆంధ్రా కాశ్మీరం’’ అని పిలుచుకునేలా ఆహ్లాదపరుస్తాయి. ఎండాకాలంలో కూడా ఈ ప్రాంతం చల్లగానే ఉంటుంది. ఇక్కడ వేలాదిరకాల ఔషధ వృక్షాలు, మొక్కలు, జంతువులు, విష కీటకాలు, వివిధ రకాల పక్షులు వంటివి ఎన్నో వున్నాయి. ప్రకృతి సౌందర్యాలతోపాటు ఎన్నో జంతువులు, వృక్షాలకు నిలయంగా వున్న ప్రదేశం జాతీయపార్కుగా గుర్తించబడింది.

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలను ఆనుకొని ఉన్నాయి. హైదరాబాదు నగరానికి 410 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోను ఈ పాపికొండలు వుంటాయి. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

ప్రత్యేకతలు :

చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యోదయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్‌ఫైర్‌... గోదారమ్మ ఒడిలో స్నానం... ఇలా ఎన్నో ప్రత్యేకతలను ఈ పాపికొండల్లో ఇనుమడింపబడి వున్నాయి. ఇక్కడికి ఒక్కసారి వస్తేచాలు.. మళ్లీమళ్లీ రావాలనే భావన ప్రతిఒక్కరిలోనూ పుడుతుంది. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా, ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం.

ఆలయం చరిత్ర :

ఈ పాపికొండల ప్రాంతంలో శ్రీరాముని వాకిటం అనే ఆశ్రమం వుంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధకాలంలో ఒక మునీశ్వరుడు రాజమండ్రి నుంచి లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తుండగా.. పేరంటాలపల్లి వద్ద రాత్రి అయింది. దీంతో ఆయన అక్కడే అక్కడ బస చేశారు. ఆయన నిద్రపోయిన సమయంలో కలలో భగవంతుడు కనిపించి... ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట! అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఏర్పరుచుకుని, ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులు తమకు విద్యా బుద్దులు, వైద్య సౌకర్యం కల్పించిన మునీశ్వరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : papi hills  indian national park  andhra kashmir  godavari river  telugu news  

Other Articles