Worlds oldest indian married couple guinness book of world record

oldest couple, worlds oldest couple, oldest indian couple, guinness book of world records, guinness book record officers, indian oldest couple, england oldest couple

worlds oldest indian married couple guinness book of world record

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంటగా గుర్తింపుపొందిన భారతీయులు

Posted: 11/27/2014 12:11 PM IST
Worlds oldest indian married couple guinness book of world record

చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో ప్రేమకథలను విన్నాముగానీ... చాలాకాలం వరకు జీవితాంతం కలిసి జీవించిన జంటల గురించి ఎప్పటికీ విని వుండం! నిజానికి చాలాకాలం జీవితాంతం కలిసి మెలిసి వున్న జంటలు ఎక్కువే వున్నాయి కానీ.. దీర్ఘాయువుతోబాటు వృద్ధజంటగా జీవించిన జంటలు అంతగా లేవనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఆ స్థానం కూడా భర్తీ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా ఓ జంట అత్యంత వృద్ధ జంటగా గుర్తింపు పొందారు. వాళ్లు వయస్సులో సెంచరీతో నాటౌట్’గా నిలవడంతోబాటు ఇప్పటికీ తమ నాలుగుతరాల పిల్లాపాపలతో సంతోషంగా వున్నారు. వాళ్ల వివరాలేంటో తెలుసుకుందాం...

ఇంగ్లండ్-లో నివాసముంటున్న కరమ్’చంద్ - కర్తారీ దంపతులు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంటగా గుర్తింపు పొందారు. వయసులో ఇద్దరూ సెంచరీ కొట్టారు. భర్త వయస్సు 109 ఏళ్లయితే, భార్య వయసు 102 ఏళ్లు. వీరిద్దరిదీ 1925 లవ్-స్టోరీ. ఇండియాకు చెందిన ఈ వృద్ధజంట 1965లో ఇంగ్లండ్’కు వలసవెళ్లారు. అక్కడే వెస్ట్ యార్క్’షైర్’లో తమ నివాజం ఏర్పరుచుకుని తమ జీవితాన్ని కొనసాగించారు. వీరికి ఎనిమిది మంది సంతానం. 27 మంది మనవలు, 23 మంది ముని మనవలు కూడా వున్నారు. ఇప్పటివరకు ఈ జంట నాలుగు తరాలను చూసేసింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సెంచరీ దాటినాకూడా ఇప్పటికీ చలాకీగా డాన్సులు చేస్తూ ఆ దంపతులు గడిపేస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు ఒకేరోజు పుట్టినరోజు జరుపుకుంటారు. ఆ రోజు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ల సంతామంతాకలిసి సంబరాలు చేసుకుంటారు.

ఇక ఆరోగ్య రహస్యానికి వస్తే.. ఆ పెద్దాయన ప్రతి రాత్రి భోజనానికి ముందు ఓ సిగరెట్ కాలుస్తాడట. వారానికి నాలుగైదు సార్లు బ్రాంది లేదా విస్కీ తీసుకుంటాడట. మరి అవి ఆరోగ్యానికి హాని కదా అని ప్రశ్నిస్తే... మనసుకు నచ్చినట్లు ఉంటేనే సంతోషంగా ఎక్కువ రోజులు జీవిస్తామని సెలవిస్తున్నాడు. దేవుడి ఆశీస్సుల వల్లే తాము సంతోషంగా జీవిస్తున్నామని ఆయన భార్య కర్తారీ చెబుతోంది. ఇంగ్లండ్-లోని  పిల్లాపాపలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తున్న వీరిద్దరూ.. వందేళ్లు దాటినా భర్త, భార్య కలిసిమెలిసి ఇంకా జీవించే ఉండటం విశేషంగా పేర్కొంటున్నారు. నిజంగా ప్రపంచంలోనే ఇదొక అరుదైన ఘట్టమని గిన్నిస్ బుక్ అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles