Puccha vasudeva parabrahma sastry biography telugu archeologist telangana government news

pv sastry news, pv sastry fecilitation, pv sastry biography, pv sastry life history, kakatiya kingdom, kakatiya kingdom history, pv sastry kakatiya kingdom news

puccha vasudeva parabrahma sastry biography telugu archeologist telangana government news

తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక - పురావస్తు పరిశోధకుడు

Posted: 11/26/2014 12:18 PM IST
Puccha vasudeva parabrahma sastry biography telugu archeologist telangana government news

ప్రపంచవ్యాప్తంగా వున్న దేశాలలో కేవలం భారతదేశం ఒక్కటే ప్రాచీన కాలానికి చెందిన సంస్కృతీ-సంప్రదాయాలకు నిలయమని అందరికీ తెలిసిన విషయమే! 5000 సంవత్సరాలకుపైగా పురాతన కాలానికి సంబంధించి ఎన్నో కట్టడాలు, శిథిలాలు దేశంలో లభ్యమయ్యాయి. ఇక వీటితోబాటు దేశంలో రాజ్యమేలిన ఎంతోమంది రాజవంశస్థుల చరిత్రలు కూడా తెలిసిందే! అటువంటివారి చరిత్రపై అధ్యయనాలు చేసినవారు ఎందరో మహానుభావులు వున్నారు. వారి జీవిత విధానాలను, అనుసరించే పద్ధతులను, సంస్కృతీ-సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు విశ్లేషించారు ఆ పరిశోధకులు. అలా పరిశోధనలు చేసినవాళ్లలో డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి ఒకరు. తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు. ఈయన కాకతీయుల చరిత్రపై అనేక అధ్యయనాలు చేసి పలు గ్రంధాలను రచించారు. అందులో ఆయన రాసిన ‘‘ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం’’ గ్రంథం బాగా ప్రాచుర్యం పొందింది.

పరబ్రహ్మశాస్త్రి జరిపిన పరిశోధనలు :

ఈయన కాకతీయుల గురించి, శాతవాహనుల గురించి లోతైన-నికార్సయిన అధ్యయనం చేసిన ఏకైక పరిశోధకుడు. కాకతీయ వైభవానికి సంబంధించి వెలుగుచూడని కొన్ని అంశాలను గుర్తించి, అజ్ఞాతంగా ఉన్న శాసనాలను వెలికితీసి, వాటిపై   ప్రామాణిక గ్రంథాలను రచించారు. గ్రామాలకు వెళ్లి అసలు చరిత్ర ప్రజల జీవనవిధానంలోనే ఉందని గుర్తించిన ఈయన.. అదే తపనతో ఆ సమాచారాన్ని ఒడిసిపట్టుకుని ఏ హంగులూ లేనికాలంలో అద్భుతమైన యజ్ఞం చేశారు. ఈవిధంగా తనదైన శైలిలో పరిశోధనలను చేసినందుకుగాను శాస్త్రికి ఎన్నో పురస్కారాలు లభించాయి. ఈయన చరిత్రనే గాక, లిపి పరిణామాన్ని కూడా వివరించి పండితులను మెప్పించిన మేధావి. అలాగే శాసనాలు అన్నీ చదవగలిగిన ఏకైక వ్యక్తి ఈయన ఒక్కరేనని అనేకమందితో గుర్తింపబడ్డారు కూడా!

ఆనాటి చరిత్రను కాలగర్భంలో కలిసిపోకుండా దానిని వెలికితీసి, రాబోయే తరాలకు జ్ఞానాన్ని అందించిన శాస్త్రిని తెలంగాణప్రభుత్వం 2014 అక్టోబర్ 21వ తేదీన సన్మానించింది. అలాగే లక్ష రూపాయల చెక్కును బహూకరించింది. ఈ సన్మాన నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం హైదరాబాద్ చరిత్రకు కుతుబ్’షాహీలను ఆధారంగా తీసుకుంటున్నాముగానీ.. వాస్తవానికి అంతకంటేముందే  విష్ణుకుండినుల మూలపురుషుడు అయిన మాధవ వర్మకు సంబంధించిన శాసనాలు అందుబాటులో ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. మాధవవర్మకు సంబంధించిన శాసనాలను ఆధారంగా తీసుకుని హైదరాబాద్ చరిత్ర చెప్పే ప్రయత్నం నేటి పరిశోధకులు చేయాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles