Chandrasekhara venkata raman biography raman effect nobel prize

chandrasekhara venkata raman, cv raman news, chandrasekhara venkata raman biography, chandrasekhara venkata raman rama effect, raman effect, chandrasekhara venkata raman life story, chandrasekhara venkata raman history, raman effect research, nobel prize winners, chandrasekhara venkata raman nobel prize

Chandrasekhara Venkata Raman biography raman effect nobel prize

‘నోబెల్ బహుమతి’ గెలుచుకున్న భారతీయ భౌతికశాస్త్రవేత్త

Posted: 11/22/2014 01:14 PM IST
Chandrasekhara venkata raman biography raman effect nobel prize

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విశేష సేవలు అందిస్తేగానీ ‘నోబెల్ బహుమతి’ లభించదు. అటువంటి పురస్కారాన్ని అందుకున్నవారిలో సి.వి.రామన్(చంద్రశేఖర వేంకట రామన్) కూడా ఒకరు. భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త అయిన ఈయన.. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టారు. రామన్ ఎఫెక్ట్ అంటే... పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ విషయాన్ని ఆయన 1928 మార్చి 16న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. ఇంతటి విశేషమైన పరిశోధనకుగాను ఈయనకు 1930లో నోబెల్ పురస్కారం లభించింది. అలాగే 1945లో భారత ప్రభుత్వం ఆయనను ‘‘భారతరత్న’’ పురస్కారంతో సత్కరించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.

జీవిత విశేషాలు :

1888 నవంబర్ 7వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో నివాసమున్న చంద్రశేఖర్ అయ్యర్-పార్వతి అమ్మాళ్ దంపతులకు సివి రామన్ జన్మించారు. వీరిది మధ్యతరగతి కుటుంబం కావడంతో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞానశాస్త్ర విషయాలపట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. పైగా ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడంతో అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. దీంతో ఆయన చిన్నతనం నుంచే తెలివైన విద్యార్థిగా పేరుగాంచారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన ఆయన.. తన 12వ ఏటలోనే  మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశారు. అలాగే 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రధముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది.

ఉద్యోగ జీవితం :

1907లో ఉద్యోగరిత్యా కలకత్తాకు బదిలీ అయిన ఆయన.. అక్కడి ఇండియన్స్ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించారు. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు అమ్మాళ్‌తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి ఆయన అక్కడికి వెళ్లారు. అప్పుడు ఆ సంస్థ గౌరవ కార్యదర్శితో కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్‌కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి.

రామన్ తన తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల మీద కొనసాగించేవారు. 1921లో లండన్’లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే ఆనాడు ఆయన పరిశోధనలపై నవ్వులాటగా చర్చించుకోవడంతో ఆయనకు పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతిశాస్త్రం వైపు మార్చారు. ఒకనాడు ఆయన ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రపు నీరు రెండింటికి నీలిరంగు వుండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పుడు ఆయన.. ‘‘సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం’’ అని ఊహించారు. అంతే.. కలకత్తా నుంచి లండన్ చేరుకోగానే ఆయన పరిశోధనలు చేశారు.

ఆ పరిశోధనల ఫలితంగానే ఆయన 1928 ఫిబ్రవరి 28న ‘‘రామన్ ఎఫెక్టు’’ను కనుగొన్నారు. దీనిని ఆయన 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించారు. అందుకే..  బ్రిటీష్ ప్రభుత్వం 1929లో ‘‘నైట్‌హుడ్’’ బిరుదుతో సత్కరించింది. ఈ పరిశోధనల్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఆనాడు ఆయన 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతోనే ఆ అసామాన్యమైన పరిశోధనను చేసి నిరూపించారు. అదిచూసిన శాస్త్రజ్ఞులు రామన్ ను ఎంతగానో అభినందించారు. ఈయన పరిశోధన విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రధానం చేశారు. అలాగే భారత ప్రభుత్వం కూడా 1945లో రామన్’ను ‘‘భారతరత్న’’ పురస్కారంతో సత్కరించింది. 1970లో ఆయన మరణానంతరం.. దేశంలో సైన్స్ అభివృద్ధికోసం ఆయన అందించిన విశేషసేవలకు ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles