Bn reddy biography film producer director telugu film industry malleeswari bangarupapa swarga seema movies

bn reddy, bn reddy latest news, bn reddy history, bn reddy life story, bn reddy movies, bn reddy backdrop, bn reddy wikipedia, bn reddy life story in telugu, bn reddy history in telugu, bn reddy productioin houses, telugu movie directors, telugu film industry producers, telugu movie, tollywood

bn reddy biography film producer director telugu film industry malleeswari bangarupapa swarga seema movies

‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ పొందిన తొలి దక్షిణ భారతీయుడు

Posted: 11/27/2014 04:05 PM IST
Bn reddy biography film producer director telugu film industry malleeswari bangarupapa swarga seema movies

చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలను రూపొందించి చలనచిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన వాళ్లలో బీ.ఎన్.రెడ్డి (బొమ్మరెడ్డి నరసింహారెడ్డి) ఒకరు! ఈయన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. కేవలం బిజినెస్’పరంగా కాకుండా నలుగురికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన ఈయన.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి దక్షిణ భారతీయుడు.

జీవిత విశేషాలు :

1908 నవంబర్ 16వ తేదీన  వైఎస్ఆర్ జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో బీఎన్ రెడ్డి జన్మించారు. ఈయన తండ్రి నరసింహారెడ్డి వ్యాపారరీత్యా చెన్నై నుంచి రంగూన్ (యాంగాన్)కు ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు కాబట్టి.. ఆయన చదువు అక్కడే కొనసాగింది. ఆయన బాల్యంనుంచే నాటకాల్లో వేషాలు వేసేవారు. చదువు పూర్తైన తర్వాత రంగూన్’కు వెళ్లి వ్యాపారం చేసుకోవాలనుకున్నారుగానీ.. ఆనాడు స్వదేశీ ఉద్యమ ప్రభావం ఎక్కువగా వుండటంవల్ల  కలకత్తా వెళ్ళి శాంతినికేతన్’లో కొంతకాలం గడిపారు. అక్కడే ఆయన లలిత కళల పట్ల విశేషంగా ఆకర్షితులయ్యారు. రంగూన్’లో వున్న రోజుల్లో అక్కడి జానపద కళారూపాలను, వీధి ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీంచారు. ఆ అనుభవాల ఫలితంగా ఆయన తిరిగివచ్చాక చలనచిత్ర రంగంవైపు మొగ్గు చూపారు.

సీని జీవితం :

1938లో బీఎన్ రెడ్డి రోహిణి పిక్చర్స్ స్థాపించి.. దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి, నటి కన్నాంబలతో కలిసి ‘రంగూన్ రౌడీ’ అనే నాటకం ఆధారంగా ‘‘గృహలక్ష్మీ’’ చిత్రాన్ని ప్రారంభించారు. అయితే ఆ సినిమాలో రసవత్తరం సన్నివేశం చేయబోతుంటే.. అది నచ్చన బీఎన్ ఆ చిత్రంనుంచి బయటకొచ్చేశారు. తరువాత ఆయన తన మిత్రులతో కలిసి ‘‘వాహినీ పిక్చర్స్’’ స్థాపించారు. ఇక అప్పటినుంచి ఆయన వెనకడుగు వేయకుండా వరుసగా చిత్రాలను నిర్మించుకుంటూ ముందుకు సాగారు. చాలాసినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన రూపొందించిన సినిమాల్లో ‘‘స్వర్గసీమ, మల్లీశ్వరి, బంగారుపాప’’లాంటివి చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయాయి. అందులో ‘‘స్వర్గసీమ’’  వియత్నామ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో పాల్గొని ఒక విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలితెలుగు సినిమాగా పేరుగాంచింది.

చిత్రపరిశ్రమలో ఈయన అందించిన సేవలకు, ఆయన తెరకెక్కించిన మంచి సినిమాలకు ఎన్నో పురస్కారాలు లభించాయి.

గుర్తింపు-గౌరవాలు :

1. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(అందుకున్నతొలి దక్షిణభారతీయుడు - 1975)
2. కలైమామణి,
3. పద్మభూషణ్,
4. గౌరవ డాక్టరేట్లు,
5. శాసనమండలి సభ్యత్వం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bn reddy  dadasaheb phalke award  telugu film industry  directors producers  telugu news  

Other Articles