butta renuka all set to join tdp.. తట్టాబుట్టా సర్ధుకోనున్న మరో వైసీపీ ఎంపీ.?

Butta renuka all set to join tdp will it fetch ruling party

YSRCP, TDP, Renuka, Kurnool MP, Butta Renuka, bhuma nagi reddy, bhuma akhila priya, nandyal by-elections, YS Jagan, nara lokesh, politics

KURNOOL YSRCP MP Butta Renuka all set to join ruling tdp, giving shock to ycp, just in front of nandyal bye polls. will it fetch the ruling party in the upcomming by polls

తట్టాబుట్టా సర్ధుకోనున్న మరో వైసీపీ ఎంపీ.?

Posted: 07/15/2017 03:45 PM IST
Butta renuka all set to join tdp will it fetch ruling party

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ రమారమి తట్టాబుట్టా సర్దుకుని వలస వెళ్లనున్నారా..? మరికొద్ది రోజుల్లో రానున్న ఉప ఎన్నికలకు ముందుకు ఎంపీ ఈ నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష పార్టీకి షాక్ ఇవ్వనున్నారా..? అధికార పార్టీ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారా..? ఇంతకీ ఎవరా ఎంపీ..? అంటే.. కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ బుట్టా రేణుక. పార్టీ ఫిరాయించేందుకు అన్ని మార్గాలను సుగమం చేసుకుని.. తనను గెలిపించిన పార్టీ అధినేత జగన్ నిర్వహిస్తున్న సమావేశానికి డుమ్మా కోట్టి మరీ.. అధికార పక్షానికి చెందిన యువనేత, మంత్రి నారా లోకేష్ తో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు బుట్టా రేణుక డుమ్మా కోట్టి మరీ.. లోకేష్ తో భేటీ కావడం.. ఒక్కసారిగా కర్నూలు జిల్లా రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలలో అసక్తిగా మారింది. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ సమయంలో అమె ఆయనను కలిశారు. ఇరువురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే గతంలోనూ అమె ఇలాంటి చర్యలకే పాల్పడినా.. వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు.

2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, కర్నూలు జిల్లా నుంచి గెలిచిన ఎంపీ బుట్టా రేణుక.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అయితే తాను టీడీపీలో చేరడం లేదని స్ఫష్టం చేసిన అమె.. తన భర్తను మాత్రం టీడీపీలోకి వెళ్లకుండా అపలేకపోయారు. స్వయంగా చంద్రబాబు ఆయనను పార్టీ కండువా వేసి సార్టీలోకి అహ్వానించారు. అయినా అమె గత మూడేళ్లుగా వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను కర్నూలు నుంచి మరోసారి ఎంపీగా బరిలోకి దింపకుండా.. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దింపుతారన్న వార్తలు కూడా వచ్చాయి.

దీంతో దీపం వుండగానే ఇల్లు చక్కబెటుకోవాలని అమె భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఏకంగా నంద్యాల ఉప ఎన్నికల ముందు ఇలాంటి ఫిరాయింపులు జరిగితే.. అది అధికార పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలసిరాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నాగిరెడ్డి అకాల మరణంతో స్థానికంగా సానుభూతి వెల్లివిరిసినా.. ప్రసుత్తం ప్రభుత్వంపై మాత్రం ప్రజల్లో తీవ్ర అసహనం వుందన్నది సీఎం చంద్రబాబు మాటల్లోనే స్పష్టమైంది. మా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి మాకు ఓటు వేయాలని ఆయన ఇటీవల ప్రకటించడం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే ఈ తరుణంలో ఎంపీ పార్టీ ఫిరాయింపుకు పాల్పడినా.. టీడీపీకి నష్టమే కానీ లాభం లేదన్నది రాజకీయ విశ్లేషకులు భావన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  TDP  Renuka  Kurnool MP  Butta Renuka  YS Jagan  politics  

Other Articles

 • Pawan kalyan removed the mask of tdp backstabbing politics

  టీడీపీ వెన్నుపోటు రాజకీయ ముసుగు తొలిగిందా.?

  Apr 20 | నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి నేత ముఖ్యమంత్రి అయితే ఆయన నిర్మించే రాజధాని చిరస్థాయిగా ప్రపంచవ్యాప్త గుర్తింపుతో సాగేలా వుంటుందని తలచి.. గత సార్వత్రిక ఎన్నికలలో కేవలం నరేంద్రమోడీకి మాత్రమే అనుకూలంగా ప్రచారం చేస్తున్న జనసేనాని,... Read more

 • Pawan kalyan transperency politics make him scape goat

  పనవ్ చుట్టూ ‘కౌచ్’ దుమారం.. ‘పాచిక’ పారవేస్తున్నదెవరూ.?

  Apr 19 | సినీమా ప్రపంచంల రారాజుగా వెలుగొందుతూ.. కోట్ల రూపాయలను అర్జిస్తున్న కుటుంబం మెగాస్టార్ కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చిన అణిముత్యమే పవన్ కల్యాన్. సినిమాలు చాలు అనుకుని.. తమకు రాష్ట్రంలో ఇంతటి గుర్తింపును తీసుకువచ్చిన... Read more

 • Tdp dreams of comming into power in 2019 elections comes true

  ఒంటరైన టీడీపీ.. మునిగిపోయే పడవగా మారుతుందా.?

  Apr 09 | ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందా..? అన్న ప్రశ్న ప్రస్తుతం తరుణంలో హాట్ టాపిక్ గా మారగా, టీడీపీకి చెందిన పలువురు ద్వీతీయ శ్రేణి నేతలు అప్పుడే తమ అటు వైసీపీ,... Read more

 • Icici may mull road ahead for ceo chanda kochhar

  రాజీనామా యోచనలో ఐసిఐసిఐ సీఈవో చందాకొచర్

  Apr 09 | ఐసిఐసిఐ బ్యాంకు సీఈవో చందాకొచ్చర్ తన పదవికి రాజీనామా చేయనున్నారా.? ఇప్పుడిదే బ్యాంకింగ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహిళగా ఓ ప్రైవేటు బ్యాంకు చైర్మన్ పగ్గాలను చేపట్టిన ఆయన తనపై వచ్చిన... Read more

 • Prodyut bora and sivaji sensational comments on bjp true

  బీజేపిపై వారు చేసిన అరోపణలు నిజమేనా.?

  Mar 23 | నాలుగేళ్లకు ముందు దేశప్రజల్లో వినిపించిన, కనిపించిన మోడీ సమ్మెహనాస్త్రాలు.. కనుమరుగువుతున్నాయా.? బీజేపిలో గురువులను పక్కనబెట్టి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టి.. యావత్ దేశానికి తామే రాజు.. తామే మంత్రి అన్న రీతిలో ప్రధాని... Read more

Today on Telugu Wishesh