I don’t know where I will be after July 2, leave alone 2019: Smriti Irani కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నైరాశ్యమా..? వేదాంతమా.?

I don t know where i will be after july 2 leave alone 2019 smriti irani

Smriti Irani, Bharatiya Janata Party (BJP), Narendra Modi, Textiles India, Goods and Service Tax (GST), Amethi, Gandhinagar, Gujarat, clothing manufacturers, Finance Ministry

I don’t know where I will be after July 2, let alone 2019 says union textile minister smriti irani. Kal kisne dekha... was the question from her side to the media.

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నైరాశ్యమా..? వేదాంతమా.?

Posted: 06/27/2017 01:52 PM IST
I don t know where i will be after july 2 leave alone 2019 smriti irani

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నైరాశ్యంలోకి జారుకున్నారా..? లేక వేదంతధోరణిలో వెళ్లిపోయారా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినంత కాలం హుషారుగా, దూకుడుగా వున్న స్మృతి ఇరానీ.. జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు అందుకోగానే అమెలో నిర్వేదం ఎందుకు నెలకొందన్న అనుమానాలు అటు బీజేపి నేతలతో పాటు అమె అభిమానుల్లో కూడా రేకెత్తుతున్నాయి, ఈ తరహా అనుమానాలు కలగడానికి అమె గుజరాత్ లో చేసిన వ్యాఖ్యలే కేంద్రబింధువవుతున్నాయి.

గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లో జ‌రుగుతున్న ఇండియా టెక్స్‌టైల్ ఎగ్జిబిష‌న్ కు కేంద్ర జౌళి శాఖ మంత్రి హోదాలో స్మృతీ ఇరానీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అమెను పలుకరించిన మీడియాకు అమె వేదాంతధోరణిలో సమాధానం చెప్పడంతో మీడియా ప్రతినిధులు విస్మయానికి గురయ్యారు. అమేధి నుంచి గెలుపును లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి హోదాలు అనేక పర్యాయాలు తాను ఓటమిని చవిచూసిన ప్రాంతానికి వెళ్లిన స్మృతి ఇరానీ.. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ యువనేత రాహుల్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

దానిన పరిగణలోకి తీసుకున్న మీడియా.. 2019 ఎన్నిక‌ల్లో అమేథీలో త‌మ రాజ‌కీయ భ‌విష్యత్తు గురించి ప్రశ్నించ‌గా... ఈ ఎగ్జిబిష‌న్ జూలై 2న ముగుస్తుందని ..ఆ రోజు త‌ర్వాత ఎక్కడ ఉంటాన‌నే విష‌య‌మే తనకు తెలియదని.. ఇక 2019 ఎన్నికల పరిస్థితి గురించి ఇప్పుడే తానెల చెప్పగలను అంటూ నైరాశ్యంలో సమాధానం ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ ను విమర్శించి.. ఇక అవకాశాన్ని చేజింక్కించుకుని మరీ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసే కేంద్రమంత్రి.. ఒక్కసారిగా ఇలా నిర్వేదంలోకి జారిపోయారెందుకు అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అక్కడున్న విలేకరులు మీకు అదర్శమైన రాజకీయ నేత ఎవరని ప్రశ్నించగా, నరేంద్రమోడీ చిత్రపటాన్ని అమె చూపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  Union Textile minister  amethi  Gandhinagar  Gujarat  politics  

Other Articles