KCR CBN Serious Focus on Constituencies Reorganization

Kcr and chandrababu join hands to fight on centre

Telugu States CMs Secret Meet, KCR Naidu Secret Meet, KCR CBN, KCR Constituencies Reorganization, Chandrababu Naidu Constituencies Reorganization, Telugu States Constituencies Reorganization, Monsoon Session Constituencies Reorganization, Naidu KCR pressure Modi

Telugu States CMs Secret Meet at Kovind’s Nomination. Discuss on Constituencies Reorganization and put presuure on Centre. After Modi and Other NDA leaders come they set s side topic.

కామన్ ప్రాబ్లమ్ పై కేంద్రంతో కొట్లాడతారా?

Posted: 06/27/2017 12:46 PM IST
Kcr and chandrababu join hands to fight on centre

తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఇంకా తెగని టాపిక్ ఏదైనా మిగిలి ఉందంటే అది నియోజకవర్గాల పునర్విభజనే. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రం నుంచి ప్రతికూలత రాగా, ఎలాగైనా దీనిని ఓ కొలిక్కి తేవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా యత్నిస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం, బిల్లు ద్వారా రాష్ట్రపతి ఆమోద ముద్ర, అవసరమైతే న్యాయపరంగా ముందుకు వెళ్లాలని టీ సర్కార్ యత్నించగా, నేరుగా ఎన్టీయే ద్వారానే గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుని ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఇంతకాలం భావిస్తూ వస్తోంది.

అయితే ఈ ప్రయత్నాలేవీ సత్ఫలితాలను ఇవ్వకపోవటంతో ఇద్దరు చంద్రుళ్లు ఒకే తాటిపైకి వచ్చి కేంద్రం పై ఒత్తిడి తేవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మొన్నామధ్య రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ వేసే టైంలో ప్రధాని మోదీ వీరిని కలవటానికి ముందు ప్రత్యేకంగా భేటీ కావటంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అంశం త్వరగతిన తేల్చాలని నీలదీయబోతున్నారు. వచ్చే నెలలో(జూలై 17 నుంచి) జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై తాడో పేడో తేల్చేయాలని కోరబోతున్నారు.

అయితే నియోజకవర్గాల పెంపు బిల్లును న్యాయవిభాగం ఇప్పటికే సిద్ధం చేసిందని, పీఎంవో ఆదేశాల కోసం కేంద్ర హోంశాఖ ఎదురుచూస్తోందన్న విషయాన్ని అధికారులతో రహస్యంగా తెప్పించుకున్న కేసీఆర్, లేట్ చేయకుండా చంద్రబాబుతో ప్రస్తావించినట్లు భోగట్టా. మరోపక్క కేంద్రంతో తాను నిరంతరం టచ్ లో ఉన్నప్పటికీ, ఉద్యోగుల విభజన, నోట్ల రద్దు ఇలా... సాంకేతిక కారణాల పేరిట జాప్యం చేస్తూ వస్తున్నారని బాబు కూడా కేసీఆర్ తో చెప్పాడంట. భేటీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఎన్డీయే నేతలు రావటంతో వారిద్దరు చర్చలు ఆపేసి గప్ చుప్ అయినట్లు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం మాత్రమే ఉండటంతో త్వరగతిన ఈ అంశం తేల్చేయాలని ఇద్దరు చంద్రుళ్లు గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు స్పష్టమౌతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Andhra Pradesh  Constituencies Reorganization  PM Modi  

Other Articles