చిన్నబాబుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందా..? Nara Lokesh explanation on sakshi article draw critics

Nara lokesh explanation on sakshi article draw critics

Nara Lokesh, sakshi media, sakshi paper, mental balance, critisism, Chandrababu Naidu, Nara Lokesh assets, Andhra Pradesh, Heritage Foods, Heritage Foods shares, Lokesh Nara, Telugu Desam Party

TDP general secratary and contestant Nara Lokesh draws critisism as he lashes out on sakshi media, after giving explanations on his grown assets value.

చినబాబుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందా..?

Posted: 03/10/2017 07:42 PM IST
Nara lokesh explanation on sakshi article draw critics

తన ఆస్తులపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తన అస్తుల విషయంలో పోంతన లేదంటూ ప్రతిపక్ష నాయకుడికి చెందిన ఓ మీడియా కథనాలను ప్రచురించడంపై వివరణ ఇచ్చిన ఆయన అ మీడియా, పత్రికలపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా తాను హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేస్తున్నానని.. అయితే ఇన్నాళ్ల షేర్లు కొంటున్న విలువను మాత్రమే తాను తన అస్తుల చిట్టాలో చూపానని, అయితే ఇప్పుడు ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు మార్కెట్ విలువను చూపానన్న లోకేష్.. వివరణ ఇవ్వడమే ఈ అనుమానాలకు తావిస్తుంది.

ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ స్మోకింగ్‌ కంటే ఘోరమైంది...సాక్షి పేపర్‌ చదవడం, సాక్షి చానల్‌ చూడటం అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు దయచేసి సాక్షి పేపర్‌ చదవొద్దని, చానల్‌ చూడదంటూ లోకేశ్‌ సూచనలు చేశారు. ఆ పేపర్‌లో లేనిది రాస్తారు, చెప్పింది రాయరంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సాక్షి మీడియాను ఫాలో అయితే మెంటల్‌ బ్యాలన్స్‌ తప్పుతుందంటూ కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, అందువల్ల తనపై వచ్చిన ఆరోపణలపై ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నట్లు చెప్పారు.

ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు సందేహాలకు బీజం పడింది. సాక్షి పేపర్, ఛానెల్ ఫాలో అయితే మెంటల్ బ్యాలెన్స్ తప్పుతుందని అన్న నారాలోకేష్.. వాటిని ఫాలో అయ్యి తనపై అదే మీడియాలో వచ్చిన కథనాలకు, అరోపణలకు వివరణ ఇచ్చుకున్నారు. దీంతో ఆయన మెంటల్ బ్యాలెన్స్ కొల్పోయారా..? అంటూ వైసీపీ నేతలు సెటైర్లు విసురుతున్నారు. మరి దీనిపై కూడా నారాలోకేష్ వివరణ ఇస్తారో..? లేదో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Lokesh  sakshi media  sakshi paper  mental balance  critisism  Chandrababu  

Other Articles