బీజేపిలో చేరికపై సినీ హీరోయిన్ రమ్యకు చుక్కెదురైందా..? Bjp shows red flag to actress Ramya in joining the party

Bjp shows red flag to actress ramya in joining the party

Ramya, SM Krishna, Congress, BJP, Ramya to join BJP, Actress ramya, controvesial ramya, ramya congress, ramya bjp, ramya karnataka,

The rumour of possibility of actress-turned-politician Ramya has created a sensation in the Karnataka BJP. The party members were heard saying that they will commit suicide if she is allowed to join BJP.

బీజేపిలో చేరికపై సినీ హీరోయిన్ రమ్యకు చుక్కెదురైందా..?

Posted: 03/16/2017 01:37 PM IST
Bjp shows red flag to actress ramya in joining the party

సినీ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు రమ్య తన గాడ్ ఫాదర్ తో కలసి పయనించాలని భావిస్తుందన్న వార్తలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో బీజేపితో పాటు ఆర్ఎస్ఎస్ లను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలను సంధించి వివాదాస్పద నేతగా మారిన రమ్యను బీజేపి అధిష్టానం స్వాగతిస్తుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రమ్యకు రాజకీయాలలో గాడ్‌ఫాదర్ గా వున్న కర్ణాటక మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి ఎస్ఎం కృష్ణ ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో రమ్య తోపాటు మరికొందరు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు రావడం బీజేపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను నిద్రకు దూరం చేసింది. అమెను బీజేపిలోకి అహ్వానిస్తే.. తాము ఆత్మహత్యలు చేసుకుంటామని ఏకంగా బీజేపి, ఆర్ఎస్ఎస్ దిగువ శ్రేణి నేతలు అధిష్టానానికి తేల్చిచెబుతున్నారు. ఎస్ఎం క్రిష్ణకు స్వాగతం పలికిన నేతలు.. రమ్యను అడ్డుకునేందుకు అనేక కారణాలే వున్నాయి.
 
కాంగ్రెస్ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన రమ్య.. కార్ణటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గోంటున్నారు. అయితే అమె కూడా ఎస్ఎం క్రిష్ణతో కలసి బీజేపీ తీర్థం తీసుకోవాల్సి వున్నా.. అమెను చేరికపై అదిష్టానం కొంత వెనక్కు తగ్గింది. కార్యకర్తల నుంచి అమెను చేర్చుకోవద్దని పెద్దస్తాయిలో ఒత్తిడి రావడవంతో అధిష్టానం అమె చేరికపై ఇంకా పచ్చజెండాను ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో నిత్యం చురుకుగా వుంటూ బీజేపి, అర్ఎస్ఎస్ లపై పదునైన విమర్శలను చేసే రమ్య కూడా గత కొంతకాలంగా మౌనముద్రలోకి వెళ్లిపోయారు.

రమ్య గతంలో బీజేపిని టార్గెట్ చేస్తూ చేసిన పలు వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పందంగా మారాయి. అందరూ ఊహించినట్లు పాకిస్థాన్ పై ఉగ్రప్రభావం లేదని అది ఎంతో అందమైన దేశమని అమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని కూడా లేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అమెపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక అంతకుముందు బీజేపి, ఆర్ఎస్ఎస్ లు జాతీయవాదం గురించి తరుచూ మాట్లాడటాన్ని కూడా అమె విమర్శలు గుప్పించారు.

అసలు దేశ స్వతంత్ర్య పోరాటంలో ఏ మాత్రం పాత్రలేని బీజేపి, ఆర్ఎష్ఎస్ లు స్వతంత్ర్యం తీసుకువచ్చిన పార్టీలపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటామన్న నేపథ్యంలో వెనక్కు తగ్గిన బీజేపి అధిష్టానం.. ఆమె చేరికకు ఎర్రజెండాను చూపిందన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే అమెను కొంత అలస్యంగానే పార్టీలోకి చేర్చుకోవచ్చన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. మరి దీనిపై కార్యకర్తలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramya  SM Krishna  Congress  BJP  Ramya to join BJP  Actress ramya  karnataka  

Other Articles