Bus fare hike in Telangana soon as dissel prices goes up

Bus fare hike in telangana soon

Telangana, RTC bus, bus fares, Fitment, passengers, transport minister P. Mahender Reddy, TSRTC, Tsrtc logo, dissel prices, ticket fare hike is imminent, Telangana cm Kcr, kcr, mahender reddy, hike in dissel prices, RTC fitment

The RTC bus ticket fares in Telangana state are all set to go up. This was disclosed by transport minister P. Mahender Reddy at a press conference .

సీఎం నో అన్నా.. మంత్రి మాత్రం తప్పదంటున్నారు

Posted: 05/22/2015 06:33 PM IST
Bus fare hike in telangana soon

తెలంగాణ.. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం. బలమన ప్రాంతీయత సెంటిమెంట్ పునాదులపై.. స్వయం పాలన మా హక్కు అని నినాదానికి కదిలిన జనం మహోధ్యమం చేయడంతో దేశంలో 29 రాష్ట్రంగా అవిర్భవించింది. ముందు దగా, వెనుక దగా, కుడిఎడుమల దగా, దగా అని సమైక్య రాష్ట్రంలో దగాలతో కుదేలవుతున్నాం. లేదంటే మన రాష్ట్రం సుసంపన్న రాష్ట్రమని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సెలవిచ్చారు. అంతేకాదు తాజాగా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆర్ధిక ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. కాగా.. ఓ పైపు అడిగిన వారికల్లా తాయిలాలను ప్రకటించి.. కిమ్మనకుండా వున్న జనాలపై మాత్రం భారం మోపుతున్నారు.

ఇక ఆర్టీసీలో ప్రయాణించడం గగనమే అన్నేట్లుగా చర్జీలు పెంచనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించడంతో ప్రయాణికకులు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణ మహోద్యమంలో ఉద్యోగులు కలికితురాళ్లయితే.. ఓట్లేసి బలమైన తెలంగాణ వాదాన్ని గెలిపించిన ప్రజలు ఎవరు..? కాంగ్రెస్, టీడీపీ. సహా పలు ప్రత్యర్థి పార్టీలను కాదని తెలంగాణ కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ పార్టీకీ బ్రహ్మరథం పట్టిన ప్రజలపై ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు. అసంఘటితులైన ప్రజలు మారు మాట్లాడకుండా చార్జీలను భరిస్తారనా..? లేక వారికి ప్రశ్నించే అధికారం లేదనా..?

అసలే వేసవి వేడమితో అల్లాడుతున్న ప్రజలపై ఆర్టీసీ చార్జీల మోతను కూడా వేయయడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 ఫిట్ మెంట్, ఆర్టీసీ కార్మికులకు 44 ఫిట్మెంట్ ఇచ్చి, ప్రజలకు మాత్రం పెనుభారం మోపడం భావ్యమా అన్నది సర్కారుకే తెలియాలి. ప్రజలపై భారం మోపకుండా గ్రేటర్ హైదరాబాద్ ప్రతీ ఏడాది ఆర్టీసీ రెండు వందల కోట్ల రూపాయలను ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పిన పక్షం రోజుల్లోనే టిక్కట్ ధరలను పెంచక తప్పదని అనివార్యమని రవాణ శాఖ మంత్రి ప్రకటించడం ఎంత వరకు సబబని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్టీసీ బస్సులకు డీజిల్ లో రాయితి కల్పించేందుకు కూడా సీఎం చర్యలు తీసుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో.. అదే డీజిల్ దరల పెరుగుదలతో రేట్లు పెంచక తప్పదని మంత్రివర్యులు ప్రకటించడం ఇద్దరి మధ్య సయోధ్య వున్నట్లా..? లేక లేనట్లా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డీజిల్ పై ఇటీవల పెంచిన వ్యాట్ ను ఎత్తివేస్తే ధరలు పెంచాల్సిన అవసరం కూడా వుండదని ప్రజలు సూచనలిస్తున్నారు. డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలకు రెక్కలు వస్తుండగా, సామాన్య, మధ్య తరగతి, బిపీఎల్ కుటుంబాల పరిస్థితి ఏమిటో కూడా మంత్రివర్యులు ఆలోచించకుండా.. బస్సు చార్జీల పెంపు అనివార్యమంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఇక డీజిల్ దరల పెంపు తో పెరిగే చార్జీలు.. డీజిల్ ధరలు తగ్గినప్పుడు తగ్గిస్తారా..? వాటితో ఎందుకు ముడిపెడుతున్నారని మరికోందరు ప్రయాణికులు వాదిస్తున్నారు.

ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అని వ్యాఖ్యానించి చరిత్రలో తనకంటూ ఓ సుస్తిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి ఎన్టీరామారావును ఆదర్శంగా తీసకుని రాజకీయ ఆరంగ్రేటం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన బాటలో కాకుండా.. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఆటో రిక్షా డ్రైవర్లు అంటూ సమాజాన్ని విడదీసుకుంటూ.. సంఘాలకు గుర్తింపు నివ్వడం.. కులవారీగా తాయిలాలు ప్రకటించడం.. వెరసి ప్రజలకు మాత్రం మాయయాటలతో మభ్య పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  RTC bus  bus fares  Fitment  

Other Articles