arikela narsa reddy disappointed on party decision over mlc seat

Arikela narsa reddy to quit tdp as his rival narender reddy gets mlc seat

arikela narsa reddy to quit TDP as his rival narender reddy gets mlc seat, arikela narsa reddy disappointed on party decision, arikela narsa reddy, EX MLC arikela narsa reddy, nizamabad TDP leader, nizamabad TDP president, chandrababu, narender reddy, danam nagender, Telangana congress, hyderabad city congress president, GHMC elections, jayasudha, resigns to congress party

another set back to telangana Telugudesham party,. as senior leader arikela narsa reddy to resigns to the party

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న అరికెల నర్సారెడ్డి..?

Posted: 05/21/2015 04:25 PM IST
Arikela narsa reddy to quit tdp as his rival narender reddy gets mlc seat

తెలంగాణ రాష్ట్రంలో అదనంగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలలోని లుకలుకలను బయటపెడుతున్నాయి. నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, హైదరాబాద్ నగర కాంగ్రెస్ ఇంచార్జ్ దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు రాగా, ఇవాళ తెలంగాణ టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఒకే పార్టీలో వున్నా బద్ద శత్రువుల మాదిరిగా వుంటే వైరి వర్గానికి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేయడంతో.. నిజామాబాద్ జిల్లా టీడీపీలో ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి.

తెలంగాణలో టీడీపీ పార్టీకి వున్న ఏకైక ఎమ్మెల్సీ సీటుకు అధినేత చంద్రబాబు వేం నరేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించడంతో.. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి కినుకు వహించారు. అందుబాటులో ఉన్న తన అనుయాయువులు, అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో ఆయన త్వరలోనే టీడీపీ పార్టీని వీడే అలోచనలో వున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలందరూ టీడీపీని వీడినా.. తాను మాత్రం అంకితభావంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ..  అధికార టీఆర్ఎస్ పై ఒంటరి పోరాటం చేశానని ఆయన గుర్తు చేస్తున్నారు. తన పోరాటాన్ని అధినేత చంద్రబాబు గుర్తించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం అనునిత్యం కృషి చేస్తున్న తనను కాదని, తనకు విరోధిగా మారిన వేం నరేందర్ రెడ్డికి పేరును అధినేత ప్రకటించడంపై ఆయన తన అనుచరుల వద్ద మండిపడినట్లు సమాచారం. అయితే ఈనెల 25న నిర్వహించ తలపెట్టిన నిజామాబాద్ జిల్లా మినీ మహానాడు కు కూడా తాను హాజరుకాకూడదని అరికెల నర్సారెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arikela narsa reddy  tdp mlc  mini maha nadu  nizamabad  

Other Articles