ap, chandrababu, ministers, cabinet, sunita, raghunath

Ap cm chandrababu naidu may remove paritala sunita from his cabinet

ap, chandrababu, ministers, cabinet, sunita, raghunath

ap cm chandrababu naidu may remove paritala sunita from his cabinet. Chandrababu naidu focused on ministers work. He took some survey report on ap ministers.

పరిటాల సునీత పోస్ట్ ఊస్ట్...?!

Posted: 05/25/2015 04:58 PM IST
Ap cm chandrababu naidu may remove paritala sunita from his cabinet

ఏపి కేబినెట్ విస్తరణలో బాగంగా కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఇప్పుడున్న మంత్రుల్లో ఇద్దరికి ఉద్వాసన తప్పదని తెలుస్తొంది. అనంతపురం జిల్లా నుంచి మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరికి ఉద్వాసన పలికి, మరొకరికి శాఖ మార్చే అవకాశముంది. కొత్తగా సీనియర్‌ ఎమ్మెల్యే బీకె పార్థసారథికి అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్న మరో సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని సమాచారం. పరిటాల సునీత, కేశవ్‌ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరిలో ఎవరిని మంత్రివర్గంలో తీసుకుంటారో, ఉద్వాసన పలికేదెవరికో తెలియని పరిస్థితి ఏర్పడింది.

సమాచార పౌర సంబంధాలు, ఐటీ శాఖల మంత్రి పనితీరుపై చంద్రబాబు తీరు అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీలో ప్రచారం ఊపందుకుంది. కొత్త రాష్ట్రం ఏర్పడి ఏడాది గడుస్తున్న రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో పల్లె రఘునాథరెడ్డి ఏ మాత్రం చొరవ చూపలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రి పల్లె పనితీరుపై మంత్రిమండలి సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ల ఏర్పాటు తరహాలోనే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అధికారులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలో రెండు దఫాలు పర్యటించి క్యాంటీన్లపై అధ్యయనం చేశారు. అయినా క్యాంటీన్ల ఏర్పాటులో ఆమె ఏ మాత్రం చొరవ తీసుకోలేదని ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఆమె నిర్వహిస్తున్న శాఖను మార్చాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్త్తోంది. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రస్తుతం నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖను మార్చి మరో శాఖను అప్పగించే అవకాశాలున్నాయి. అతి పెద్దదైన రెవెన్యూ శాఖను నిర్వహించేందుకు ఆరోగ్యం ఆయనకు సహకరించడం లేదని భావిస్తున్న చంద్రబాబు రెవెన్యూ శాఖకు సమానమైన మరో శాఖను అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తొంది.

చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలరెడ్డి స్థానంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు ఎర్రచందనం విక్రయ విషయంలో మంత్రి బొజ్జల పూర్తిగా విఫలమయ్యరన్న భావన చంద్రబాబు మదిలో ఉంది. బొజ్జల సామాజిక వర్గానికి చెందిన సోమిరెడ్డికి మంత్రిపదవి ఇవ్వడం ద్వారా అదే సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలుస్తుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  chandrababu  ministers  cabinet  sunita  raghunath  

Other Articles