Differences with chidambaram led vasan to quit congress

gk vasan quits congress, gk vasan resign congress, gk vasan on congress party, gk vasan chidambaram issues, tamil maanil congress party latest, tamilnadu congress leaders latest, tamilnadu politics latest, congress party latest, chidambaram cases

differences with chidambaram led vasan to quit congress? : former minister gk vasan quits congress and starts his father foudned tamil maanila congress party again. rumors that because of differences with chidambaram vasan come out from party

కాంగ్రెస్ ను నిండా ముంచిన చిదంబరం

Posted: 11/03/2014 02:39 PM IST
Differences with chidambaram led vasan to quit congress

యూపీఏ హయాంలో ఆర్ధిక మంత్రిగా కీ రోల్ పోషించిన చిదంబరం కాంగ్రెస్ నావ మునగటంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ప్రస్థుత దుస్థితికి చిదంబరం కారణం అని విమర్శలు విన్పిస్తున్నాయి. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో రాష్ర్ట కాంగ్రెస్ చీఫ్ పదవికి జ్ఞానదేశిగన్ రాజీనామా చేశారు. మామూలుగా అయితే రాజీనామా చేస్తే బుజ్జగింపులు, సంప్రదింపులు ఉంటాయి. కాని దేశిగన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా..., కొత్త అద్యక్షుడుగా ఇళన్ గోవన్ ను నియమించి పార్టీ నాయకత్వం ఆశ్చర్యానికి, షాక్ కు గురిచేసింది.

ఇళన్ నియామకం వెనక చిదంబరం లాబీయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వంకు దగ్గరగా ఉండే చిదంబరంను రాష్ర్ట పరిణామాలపై సలహా కోరగా ఆయన.., ఇళన్ ను పెడితే ఇళ్ళు గాడిలో పడుతుంది అంతే అన్నారట. పెద్దాయన మాట ప్రకారం కొత్త సారధి నియామకంపై పార్టీ నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. అంతే వెంటనే తమిళ కాంగ్రెస్ లో సెగలు మొదలయ్యాయి. ఎవర్ని సంప్రదించి ఈయన్ని ప్రసిడెంట్ చేశారంటూ సీనియర్ నేత వాసన్ సీరియస్ అయ్యారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందని.., ఒక సమస్య తీర్చమంటే పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసేలా చిదంబరం సలహా ఇచ్చారని అంటున్నారు.

చిదంబరం - వాసన్ మద్య పలు విషయాల్లో విభేధాలు ఉన్నట్లు తమిళనాట ప్రచారంలో ఉంది. అందువల్లే వాసన్ మద్దతుదారుడుగా ఉన్న జ్ఞానదేశిగన్ రాజీనామా చేయగానే.. ఆలోచించకుండా తనకు అనుకూలంగా ఉండే ఇళన్ గోవన్ కు పగ్గాలు అప్పగించారు. ఈ నిర్ణయమే తమిళనాడులో కాంగ్రెస్ ఖాళీ అయ్యేలా చేసింది. ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. అందులో మొదటిది వ్యక్తిగత ప్రయోజనాలు, కోపాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీ మనుగడ సాగించలేదు. ఇక రెండవది ఏమంటే..., రాజకీయాల్లో ముందస్తు వ్యూహం, తాజా పరిణామాలకు కారణాలపై అవగాహన లేకుండా వ్యవహరిస్తే మోసపోక తప్పదు అని. బహుశా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకత్వంకు ఇది తెలిసివస్తుందేమో.


కార్తిక్

(this content is not having accurate information. it is given just on web source information only. not posted in a manner to demolish one's. readers are advised to be aware of own knowledge while responding on this article)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gk vasan  congress  chidambaram  tamil nadu  

Other Articles