Election winners result eff gif

facebook, twitter, narendra modi facebook name, leaders in facebook, leaders and popular stars in twitter and facebook, benifits from facebook and twitter, latest updates, maharastra election results, haryana results, bjp seats in maharastra, haryana partywise seats

maharastra and haryana election winners result effected with facebook and other social media : social media become populor now a days this not only using for communicating with others but also effecting in voting towards political leaders latest results again proved it

సోషల్ మీడియా శాసిస్తోంది.. గెలిపిస్తోంది

Posted: 10/20/2014 08:22 AM IST
Election winners result eff gif


ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సోషల్ మీడియా సైట్లు ఉన్నాయి. ఒకప్పుడు కాలక్షేపం కోసం., మనవారిని కలుసుకునేందుకు ఏర్పాటైన ఈ సంస్థలు ఇప్పుడు దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. నేతల తలరాతలను మార్చటంలో సోషల్ మీడియా ప్రభావం చూపుతోంది. వీటివల్ల గెలిచిన నేతలు చాలామందే ఉన్నారు. తాజా మహారాష్ర్ట, హర్యానా ఎన్నికలనే తీసుకుంటే ఇది నిజమని నమ్మక తప్పదు. ఎన్నికల్లో గెలిచిన పలువురు నేతలు.., సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

మహారాష్ర్ట బీజేపి అద్యక్షుడు దేవేంద్రకు 8,9200 లైక్స్, ఫాలోవర్స్ ఉంటే.., వినోద్ తవడేకు 8,48000 లైకులు ఉన్నాయి. ఇక యువనేత పంకజ్ ముండేకు 3లక్షలకు పైగా లైకులు ఉన్నాయి. వీరితో పాటు బీజేపి నేత అభిమన్యుకు కూడా 2,07,776 మంది లైక్ చేరు. ఇలా గెలిచిన వారిలో చాలామంది లక్షల మంది అభిమానులను సోషల్ మీడియా ద్వారా సొంతం చేసుకున్నారు. నిత్యం వీరి కామెంట్లు, పోస్టులు, ప్రచారాలను చూసిన ప్రజలు సానుకూల ధోరణితో ఎన్నికల్లో వారికి ఓట్లేసినట్లు విశ్లేషకులు చెప్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ప్రధాని నరేంద్రమోడీ ఈ కిటుకును ఉపయోగించి ఎంతో పాపులర్ అయ్యారు. మోడి వీడియోలు, ప్రసంగాలు, ఇతర అంశాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ అవుతుండేవి. దీంతో నెటిజన్లు.., వారి ద్వారా సామాన్య ప్రజలు మోడి గురించి ఎప్పుడూ చర్చించుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇలా సోషల్ మీడియా నేతలను గెలిపించే స్థాయికి ఎదిగిపోయింది. ఇక భవిష్యత్ లో అభ్యర్థులు సోషల్ మీడియాలోనే ప్రచారం చేస్తారేమో.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharastra  haryana  facebook  social media  

Other Articles