Bjp attempt to isolate congress party

BJP attempt isolate Congress party, Elections 2014, BJP strengthening NDA, BJP seeking support from other parties, RSS asks BJP isolate congress

BJP attempt to isolate Congress party

కాంగ్రెస్ ని ఒంటిరిని చేసే ప్రయత్నం

Posted: 05/14/2014 03:05 PM IST
Bjp attempt to isolate congress party

యుద్ధంలో ఎదుటివారి శక్తిని తగ్గించటం కూడా గెలుపుకి దారితీస్తుంది.  ప్రత్యర్థులకు సాయం చేసేవాళ్ళు లేకుండా చెయ్యటం కూడా వ్యూహంలో భాగమే.

ఆఖరి దశ పోలింగ్ అయిపోతూనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కాంగ్రేసేతర పార్టీలను కలుపుకునే ప్రయత్నం చెయ్యమని భారతీయ జనతా పార్టీకి సూచించింది.  తీరా ఫలితాలు వచ్చేంత వరకు ఆగకుండా ఈ లోపులోనే ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నించటం వలన ఎన్డియే కూటమి బలం పెరగటమే కాకుండా, ఆ పార్టీలు కాంగ్రెస్ వైపు వెళ్ళకుండా కూడా ఉంటాయి.  కాంగ్రెస్ పార్టీని ఆవిధంగా ఒంటిరని చెయ్యటమనే వ్యూహంలో భాగంగా భాజపా నవీన్ పట్నాయక్, జయలలిత, జగన్ లను కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది.  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎలాగూ అంతకుముందు భాజపాతో కలిసివున్నవారే.  

నవీన్ పట్నాయక్ మూడవ ప్రత్యామ్నాయం కోసం ప్రధాన పదవి కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో భాజపా ఆయనతో సంప్రదింపులకు పూనుకుంది.  ఎప్పుడైనా సంప్రదింపులకు నేరుగా వెళ్ళరు కదా.  ముందుగా కొందరు ఫీలర్స్ ని పంపుతారు.  ఆ ఫీలర్స్ ఇచ్చిన నివేదికనుబట్టి భాజపాతో సంప్రదింపులకు నవీన్ పట్నాయక్ అనుకూలమేనని కాకపోతే అరుణ్ జైట్లీలాంటి సీనియర్ నాయకులు సంప్రదింపులకు వస్తే బావుంటుందన్న సంకేతాన్ని ఇచ్చారు.  

దక్షిణాదిలో తమిళనాడులో అన్నా డిఎమ్ కే పార్టీ ఛీఫ్ జయలలిత అంతకు ముందు గుజరాత్ మోడల్ కంటే తమిళనాడు మోడలే బాగుందంటూ వ్యాఖ్యానించినా ఎన్డియేకి మద్దతునివ్వటానికి సిద్ధమేనన్న సంకేతాలు వచ్చాయి.  

ఎన్ సిపి నాయకుడు పిఏ సంగ్మాను, తెలంగాణాలో తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ని, సీమాంధ్రలో వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్ ని కూడా ఎన్డియేతో కలుపుకు పోవటం కోసం భాజపా వాళ్ళని సంప్రదిస్తోంది.  

ఆర్ఎస్ఎస్ సలహా ప్రకారం భాజపా పెద్ద సంఖ్యలో మద్దతు కూడగట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేసే ప్రయత్నంలో పడింది.  దాని వలన అధికారం చేతికి వచ్చిన తర్వాత చట్ట సభల్లో భాజపాకి తిరుగుండదని ఆలోచన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles