Congress not accepting exit poll

Congress is not in favor of exit polls, Exit poll results favoring BJP, Digvijay Singh cannot accept exit polls

Congress not accepting exit poll

మేం ఒప్పుకోమంతే అంటున్న కాంగ్రెస్

Posted: 05/13/2014 05:50 PM IST
Congress not accepting exit poll

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మేం ఒప్పుకోము అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.  

దేశంలో వోటర్లున్నది 80కోట్ల సంఖ్యలోనయితే కేవలం లక్షమంది దగ్గర తీసుకున్న అభిప్రాయం సరైనది ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.  ఇలాంటి వాటిని లెక్కలోకి తీసుకోమని, కేవలం మే 16 న వచ్చే ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో తెలియజేసారు.  

2004 లోను 2009 లోను ఇలాగే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ ని ప్రచారం చేసారు కాని ఏమైంది అన్నారు పార్టీ కార్యదర్శి షకీల్ అహ్మద్.  

అసలు ఎగ్జిట్ పోల్స్ అనేవి టైం పాస్ వ్యవహారమంటున్నారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.  మే 16 న వచ్చే ఫలితాలే తప్ప మిగతావి ఏమీ నమ్మదగ్గవి కావని ఆయన అంటున్నారు.  భాజపాకి తిరుగులేని విజయం లభిస్తుందని చెప్తున్న ఒక టివి ఛానెల్ విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు.  రాజస్థాన్  ల కాంగ్రెస్ కి కేవలం 2 స్థానాలే వస్తాయని ఒక ఛానెల్ అంటే, కాదు 14 సీట్లు వస్తాయని మరో ఛానెల్ అంటోందని, అసలు వీళ్ళంతా విశ్లేషించేది ఒక ఎన్నికల ఫలితాలనేనా అంటూ ఓమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.

ఒకవేళ వీళ్ళు చెప్పేదంతా అబద్ధమైతే కాంగ్రెస్ నాయకులు అందుకు సంతోషపడే విషయమేగా.  ప్రత్యేకంగా నమ్మము అని చెప్పవలసిన అవసరం ఏముంది.  ఎన్నికల ముందంటే సరే కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ చేసేవారినైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రభావితం చెయ్యవు కదా.  అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తే మాత్రం ఏమవుతుంది.  తథాస్తు దేవతలు కారు కాదు వారంతా.  

వాళ్ళ మాటలకి అంకెలు మారిపోవుకదా.  మరి దేనికి ఉలికిపాటు అంటున్నారు భాజపా నాయకులు.  మీ నమ్మకం మీ దగ్గరుంచుకోండి దేనికి మరి భయం అని అంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles