NASA spacecraft crashes into asteroid డైమార్ఫస్ గ్రహశకలాన్ని ఢీకొట్టిన నాసా అంతరిక్ష నౌక

Nasa successfully crashes dart spacecraft into asteroid dimorphos

NASA, Asteroids (celestial bodies), Spacecraft and Satellites, Dimorphos, 'DART' mission, DART spacecraft, Johns Hopkins University, Applied Physics Laboratory, (JHU-APL), Dr Lori Glaze, director of planetary science, Researchers, Didymos, space agency, US

Nasa’s Double Asteroid Redirection Test (DART) spacecraft successfully crashed into the asteroid Dimorphos on September 27. The DART mission intentionally crashed on an asteroid to test a unique defence technology. The crash is aimed at giving Earth a defence tool against future asteroids headed our way.

ITEMVIDEOS: డైమార్ఫస్ గ్రహశకలం దిశ మారింది.. అస్టారాయిడ్ ను ఢీకొట్టిన నాసా అంతరిక్ష నౌక..

Posted: 09/27/2022 12:49 PM IST
Nasa successfully crashes dart spacecraft into asteroid dimorphos

భూమిపైకి దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్‌ను దారిమళ్లించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా తలపెట్టిన డార్ట్‌ మిషన్‌ విజయవంతం అయ్యింది. ఇవాళ వేకువజామున 4.44 గంటలకు ‘డైమార్ఫస్‌’ అనే ఆస్టరాయిడ్‌ను నాసా అంతరిక్ష వ్యోమనౌక డార్ట్‌ ఢీకొట్టింది. దీంతో డైమార్ఫస్ అస్టారాయిడ్ గమనాన్ని మార్చడంలో దోహదపడింది. అంతేకాదు భూమి వైపు దూసుకువచ్చే గ్రహశకలాల నుంచి ధరణిని కాపాడటమే లక్ష్యంగా నాసా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కాగా, ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ స్వయంచాలకంగా ఆస్టరాయిడ్‌ను లక్ష్యంగా చేసుకుని, ఢీకొట్టింది.

సుమారు రూ.2500 కోట్ల విలువైన డార్ట్ (డీఏఆర్‌టీ) స్పేస్‌క్రాఫ్ట్‌.. గంటకు 22,50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ గ్రహశకలాన్ని ఢీకొట్టినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో భూమి వైపు దూసుకొచ్చే గ్రహశకలాలను నాశనం చేసే ఉద్దేశ్యంతో ఈ ప్రయోగం చేశారు శాస్త్రవేత్తలు. ఇలా అంతరిక్ష నౌక ఢీకొట్టడంతో గ్రహశకలం గమనంలో ఎంత మార్పు వచ్చిందో ఇప్పుడే చెప్పలేమని, కొంత సమయం పడుతుందని వాళ్లు తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. భవిష్యత్తులో భూమివైపు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాలను అంతరిక్షంలోనే పక్కకు మళ్లించవచ్చనేది శాస్త్రవేత్తల అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles