India's first COVID-19 vaccine Anocovax for animals స్వదేశీ పరిజ్ఞానంతో.. కరోనా టీకా.. జంతువులకు మాత్రమే..

Anocovax india s first covid jab for animals neutralises delta omicron variants

Anocovax, Narendra Singh Tomar, health news, COVID-19 vaccine, covid 19, animal vaccine, Covid 19, covid impacts on animals

Agriculture Minister Narendra Singh Tomar launched the country's first homegrown COVID-19 vaccine Anocovax for animals, developed by Haryana-base ICAR-National Research Centre on Equines (NRC). Anocovax is an inactivated SARS-CoV-2 Delta (COVID-19) vaccine for animals. The immunity induced by Anocovax neutralises both Delta and Omicron variants of SARS-CoV-2, the Indian Council of Agricultural Research (ICAR) said in a statement.

స్వదేశీ పరిజ్ఞానంతో.. కరోనా టీకా.. జంతువులకు మాత్రమే..

Posted: 06/10/2022 06:57 PM IST
Anocovax india s first covid jab for animals neutralises delta omicron variants

కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి మందిని బలితీసుకుంది. ఇది రెండేళ్ల క్రితం ఇది మన దేశంలోకి నవంబర్ 2019న ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ.. కొత్త కొత్త వేరియంట్లుగా పరిమాణాన్ని మార్చుకుని దాడి చేసింది. ఈ నేపథ్యంలో దేశప్రజలందరీ అందుబాటులోకి కరోనా టీకాలను తీసుకువచ్చిన కేంద్రం.. కరోనాను దేశం నుంచి తరిమివేయాలన్న ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దేశంలోని చిన్నారులకు మినహాయించి అందరికీ టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రప్రభుత్వం.

అయిత ఈ చిన్నారులతో పాటు కరోనా టీకాలను తీసుకునేందుకు భయపడిన కొంతమందికి కూడా ఈ మహమ్మారి నుంచి ఎలాంటి హాని సంభవించకూడదని కూడా ప్రయత్నాలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే అలా మానవుల నుంచి కాకుండా జంతువులకు సోకి అక్కడ రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నందున వాటికి కూడా వాక్సీన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో కరోనా టీకాను జంతువుల కోసం తీసుకువచ్చింది. హర్యానాకు చెందిన ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (NRC) జంతువుల కోసం అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ కొవిడ్ టీకా ‘అనోకోవ్యాక్స్’ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు.

ఈ వ్యాక్సిన్స్ కరోనా వైరస్‌లోని డెల్టా వేరియంట్‌తోపాటు ఒమిక్రాన్‌ను కూడా సమర్థంగా అడ్డుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) తెలిపింది. శునకాలు, సింహాలు, చిరుతలు, ఎలుకలు, కుందేళ్లను కరోనా వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ రక్షిస్తుందని పేర్కొంది. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవడం కంటే సొంతంగా అభివృద్ధి చేయడం నిజంగా పెద్ద విజయమని మంత్రి తోమర్ అన్నారు. అనోవ్యాక్స్‌తోపాటు సీఏఎన్-సీవోవీ-2 ఎలీసా (CAN-CoV-2 ELISA) కిట్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఫలితంగా శునకాల్లో యాంటీబాడీలను గుర్తించొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles