Police get custody of 5 minor boys in Hyderabad rape case జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: పోలీసుల రిమాండ్ రిపోర్ట్.. ఏం చెప్పారంటే.!

Jubilee hills gang rape case scene reconstruction potency test await three minors

hyderabad gang-rape, sexual assault, Sex assault, Hyderabad gang rape news, Hyderabad gang rape outrage, Jubilee Hills Gang rape case, BJP, Congress, TRS, KCR, K Chandrashekar Rao, BJP ,Gang rape accused arrested, jubilee hills gang rape, amnesia pub gang rape, Hyderabad rape case video, Hyderabad rape victim girl, Hyderabad rape case accused, Juveniles, Hyderabad rape case juvenile, pocso, Gangrape case, gangrape cases, Hyderabad gangrape, Telangana Politics

The five-day police custody of three juveniles accused in the 17-year-old girl’s gang rape case in Jubilee Hills will begin on Friday. During the custody, the three Children in Conflict with the Law (CCLs) will be questioned by a team of police officers in plain-clothes on the premises of a juvenile home.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: పోలీసుల రిమాండ్ రిపోర్ట్.. ఏం చెప్పారంటే.!

Posted: 06/10/2022 03:53 PM IST
Jubilee hills gang rape case scene reconstruction potency test await three minors

హైద‌రాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్ స‌మీపంలో బాలిక‌ను అప‌హ‌రించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో అసలు సూత్రధారి ఎవరు.? బెంజ్ కారు ఎవరిది.? ఇన్నోవా వాహనం ఎవరి పేరున ఉంది.? నేరాలు జరిగిన ఈ కార్లను పోలీసులు ఎందుకు సీజ్ చేయకుండా ఉన్నారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తులను తప్పించారన్న అరోపణలు కూడా తారాస్థాయిలో వినబడుతున్నాయి. ఇవి ప్రతిపక్షాలతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు కూడా వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే పోలీసులు ఈ కేసుల విషయంలో ప్రభుత్వం తరపున తీవ్రమైన ఒత్తడిని ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఈ క్రమంలో వారు అనేక నిజాలను దాటవేస్తున్నారని కూడా అరోపణలు వినబడతున్నాయి.

ఈ విషయాలను పక్కనబెడితే.. లో ప్రధాన సూత్రధారి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడేనని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. బాలికను తొలుత మాటల్లోకి దింపి ఆకర్షించింది అతడేనని, గతంలోనూ మనం ఒకసారి కలిశామంటూ మాటలు కలిపాడని అందులో పేర్కొన్నారు. ఆపై ఇంటివద్ద దించుతానంటూ నమ్మించి బాలికను తీసుకెళ్లాడు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్దకు తీసుకెళ్లి బాలిక నుంచి బ్యాగ్, కళ్లద్దాలు, సెల్‌ఫోన్ లాక్కున్నాడు. అనంతరం బాలికను కారులోనే కూర్చోబెట్టి నిందితులందరూ బేకరీలోకి వెళ్లి తిని, సిగరెట్లు తాగారు.

ఆ తర్వాత బాలిక వద్దకు వచ్చి కారులో తమతోపాటు వస్తేనే తీసుకున్న వస్తువులు ఇస్తామని బెదిరించి ఇన్నోవాలో తీసుకెళ్లారు. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసు నిందితుల్లో ఒకడైన సాదుద్దీన్ మాలిక్‌ను నిన్న దాదాపు ఆరు గంటలకుపైగా పోలీసులు విచారించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు అతడు పొడిపొడిగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే, ఈ కేసులోని మిగతా నిందితులైన మైనర్లతో ఉన్న సంబంధాలపై అడిగిన ప్రశ్నకు పెదవి విప్పలేదని సమాచారం. కాగా నిందితులైన ఐదుగురిలో ముగ్గురు మైనర్లను న్యాయస్థానం పోలీసు కస్టడీకి అనుమతించింది.

ప్రభుత్వ సంస్థ చైర్మన్ కుమారుడు, సంగారెడ్డి జిల్లా అధికార పార్టీ నేత కుమారుడు, కార్పొరేటర్ కుమారుడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు పోలీసులు విచారించనున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులైన ఎమ్మెల్యే కుమారుడు, బెంజ్ ‌కారు యజమాని కుమారుడి కస్టడీ కోసం కోర్టు అదేశాల కోసం పోలీసులు వేచిచూస్తున్నారు. ఈ ముగ్గురు నిందితులను న్యాయవాది సమక్షంలో సివిల్ దుస్తుల్లో విచారించాలని కోర్టు ఆదేశించింది. నిందితులను గుర్తించేందుకు బాధితురాలితో టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్‌ను నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles