Woman falls into manhole while talking on phone షాకింగ్​ వీడియో.. మ్యాన్​హోల్​లో పడిపోయిన మహిళ..!

Patna woman seen falling down open manhole in viral video

patna, woman fall in manhole, bihar woman fall manhole distracted by phone woman fall manhole, manhole, patna, woman fall in manhole, Patna woman viral video, woman talking on phone, viral video

Electronic gadgets often hog our attention these days, leading to accidents around the world with people being distracted by addictive content or conversations online. In Bihar, an incident caught on surveillance camera shows a woman engrossed in a phone conversation fall into an open manhole. The clip has since gone viral.

ITEMVIDEOS: షాకింగ్​ వీడియో.. మ్యాన్​హోల్​లో పడిపోయిన మహిళ..!

Posted: 04/23/2022 07:54 PM IST
Patna woman seen falling down open manhole in viral video

ఫోన్​ మాట్లాడుతూ రోడ్డు మీద నడవడం చాలా ప్రమాదకరం. ఈ విషయం తెలిసినా.. చాలా మంది లెక్కచేయడం లేదు. ఇలా ఫోన్లో మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నోఅమూల్యమైన ప్రాణాలు కూడా కాలగర్భంలో కలసిపోయాయి. ఎన్నో ప్రమాదాలకు ఇదే కారణంగా మారుతోంది. రోడ్డు దాటుతున్నా ఫోన్లో మాట్లాడటం అపకుండా.. వేగంగా వచ్చే వాహనాలు హారన్ ఇస్తున్నా పట్టించుకోకుండా.. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి జారుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ.. ఫోన్​లో మాట్లాడుతూ.. తెరిచి ఉన్న మ్యాన్​హోల్​లో పడిపోయింది!

బిహార్​ రాజధాని పట్నాలో జరిగింది ఈ ఘటన. ఓ వీధిలో.. మ్యాన్​ హోల్​ తెరిచి ఉంది. ఓ ఆటో అటువైపుగా వెళ్లింది. ఒక మహిళ కూడా ఫోన్​లో మాట్లాడుతూ.. ఆటో వెనక కదిలింది. ఆ ఆటో అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే తెరిచి ఉన్న మ్యాన్​హోల్​ కనిపించింది. కానీ ఫోన్​లో మాట్లాడుతున్న మహిళ.. మ్యాన్​హోల్​ను చూడలేదు. దాని మీద కాలు వేసింది. చివరికి లోపలికి పడిపోయింది. అది గమనించిన స్థానికులు మ్యాన్​హోల్​వైపు పరుగులు తీశారు. మహిళను డ్రైనేజీలో నుంచి బయటకు తీసేందుకు ప్రణాళికలు వేశారు. కొద్దిసేపటికి స్థానికులు మహిళను బయటకు తీశారు.

ఈ ఘటనలో మహిళకు ఎలాంటి గాయాలు అవ్వలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. దృశ్యాలు వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. పట్నాలోని అనేక ప్రాంతాల్లో.. నమామి గంగా ప్రాజెక్టు పనిలో భాగంగా మ్యాన్​హోల్స్​ తెరిచారు. కానీ వాటిని తిరిగి మూసివేయలేదు. ప్రమాదం జరుగుతుందని స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కనీసం సిగ్నల్​ బోర్డు అయినా పెట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles