drunkard hulchul in jubilee hills with car జూబ్లీహిల్స్ లో మందుబాబుల హల్ చల్.. టెస్టు​లో రికార్డు స్కోర్​..

Three injured in drunk driving accident at jubilee hills

Drunkard Hulchal, Drunkard Hulchal with car in jublihills check post in the morning, Harshavardhan Reddy, Patancheru, Creta car, car accident, drunkard car driving, driving under the influence , Alcohol, Car Crash"200 wala car accident, breath analyzer test score 233 points, Jubilee hills, Hyderabad police, Telangana, Crime

Jubilee Hills police on Tuesday took a 26-year-old man into custody for driving under the influence of alcohol and crashing his car into three other vehicles and leaving two people with minor injuries. Harshavardhan Reddy, a resident of Patancheruvu, was heading towards Jubilee Hills Check Post from KBR Park in his Hyundai Creta when he lost control of his vehicle.

జూబ్లీహిల్స్ లో మందుబాబుల హల్ చల్.. బ్రీత్​ అనలైజర్​ టెస్ట్​లో రికార్డు స్కోర్​..

Posted: 03/29/2022 07:05 PM IST
Three injured in drunk driving accident at jubilee hills

హైదరాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. తెల్లవారుజామునుంచే మత్తులో తూగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇప్పటివరకు రాత్రివేళల్లోనే రచ్చ చేసే తాగుబోతులు.. ఇప్పుడు పొద్దుపొద్దున్నే మొదలుపెట్టేస్తున్నారు. దర్జాగా మత్తులో రోడ్లెక్కేసి బీభత్సం సృష్టిస్తున్నారు. వీరి అడగాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ను కట్టడి చేసేందుకు పోలీసులు రాత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీరు రాత్రంతా తాగేసి ఉదయం రోడ్లపైకి వస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో తెల్లవారుజామున కారుతో హల్​చల్​ చేసిన వ్యక్తిని పరిశీలించగా.. ఏకంగా 233 పాయింట్లు స్కోర్​ చేసి పోలీసులకే షాకిచ్చాడు.

ఇప్పుడు.. రోజంతా నిర్వహించాలేమో.. అన్న సందేహం కలిగేలా చేస్తున్నారు. దానికి కారణం.. ఓ మందుబాబు పొద్దున్నే కారుతో హల్​చల్​ చేశాడు. తీరా అతడికి బ్రీథ్ అనలైజర్​ టెస్ట్​ చేస్తే.. ఏకంగా డబుల్ సెంచరీ బాది అందరిని అవాక్కయ్యేలా చేశాడు. ఇన్ని రోజులు రాత్రివేళలకే పరిమితమైన మందుబాబుల రచ్చ.. ఉదయం వేళల్లోనూ మొదలైంది. జూబ్లిహిల్స్ చెక్​పోస్టు వద్ద ఇవాళ ఉదయం ఓ కారు.. రెండు ఆటోలను ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్​ను పోలీసులు పరీక్షించి అవాక్కయ్యారు. పొద్దుపొద్దునే ఏకంగా 233 పాయింట్లు చూపించడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నగరంలో అడుగడుగునా పోలీసులు తనిఖీలు చేస్తున్నా.. మందబాబులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్న పోలీసులు.. మందుబాబుల ఆగడాలు అరికట్టేందుకు నిత్యం శ్రమిస్తున్నారు. పోలీసుల చెక్‌పాయింట్లను గుర్తించి.. మందుబాబులు తప్పించుకు తిరుగుతుండటంతో.. ఊహించని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రత్యేక బృందాలను కేటాయించి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడుతున్నారు. అయినా మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇక నుంచి డ్రంక్​ అండ్​ డ్రైవ్​లను కట్టడి చేయాలంటే.. తనిఖీలు రోజంతా నిర్వహించాలేమో..? అప్పుడైనా మందుబాబులు రోడ్డెక్కకుండా అదుపులో ఉంటారేమో..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles